తెలంగాణ

వృద్ధుడి ఆశ నెరవేరిన వేళ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మానవత్వాన్ని చాటుకున్న ఘటన హైదరాబాద్‌లో గురువారం చోటు చేసుకుంది. టోలిచౌక్‌లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని సీఎం కేసీఆర్ తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలో అదృష్టం బాగుండి సీఎం కంట పడితే తన సమస్య తీరుతుందన్న ఆశతో వికలాంగుడైన ఓ వృద్ధుడు దారి పక్కన వినతి పత్రంతో నిల్చున్నాడు. సరిగ్గా అతను ఊహించినట్టే జరిగింది. మార్గమధ్యంలో ఓ వృద్ధుడు ఆశతో దరఖాస్తు పట్టుకొని ఆశతో ఎదురు చూస్తున్న దృశ్యం సీఎం కేసీఆర్ కంట పడింది. కారు దిగి సీఎం కేసీఆర్ అతని వద్దకు వెళ్లి విషయం ఏమిటని ఆరా తీశారు. తన పేరు మహ్మద్ సలీం అని, గతంలో డ్రైవర్‌గా పని చేసే వాడినని, అనారోగ్యంతో తొమ్మిదేళ్లుగా బాధ పడుతున్నానని చెప్పారు. నాలుగేళ్ల కిందట భవనం పై నుంచి పడటంతో కాలు విరిగి వికలాంగుడిగా
మారిన విషయాన్ని సలీం వివరించారు. తన కుమారుడి ఆరోగ్యం కూడా బాగా లేదని, తనకు ఉండటానికి ఇల్లు కానీ, జీవనానికి ఎలాంటి ఆధారం కానీ లేదని వాపోయాడు. సీఎం వెంటనే స్పందించి సలీంకు వికలాంగుల పెన్షన్‌తో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజురు చేయాలని అక్కడికక్కడే హైదరాబాద్ కలెక్టర్ శే్వత మహంతిని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్ శే్వత మహంతి టోలిచౌక్‌లోని సలీం నివాసం ఉంటున్న ఇంటికెళ్లి అతను చెప్పిన విషయాన్ని నిర్దారించుకున్నారు. సలీంను వికలాంగుడిగా ధ్రువీకరిస్తూ సదరం సర్ట్ఫికెట్ జారీ చేసి వికలాంగుల పెన్షన్ మంజూరు చేశారు. అలాగే, జియాగూడలో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజురు చేశారు. ప్రభుత్వ ఖర్చుతో సలీంకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. సలీం కుమారుడు అనారోగ్యంతో బాధ పడుతుండటంతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రకటించారు.
*చిత్రం...వికలాంగుడు మహ్మద్ సలీంతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్