తెలంగాణ

గులాబీ గూటికి దుద్దిళ్ల?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటారం: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, పెద్దపల్లి జిల్లా మంథని శాసనసభ్యుడు దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీలో చేరనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆయన చేరికకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మార్చి 7న హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేసీఆర్ సమక్షంలో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ తదితరుల ఆధ్వర్యంలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గులాబీ కండువా కప్పుకునేందు కు రంగం సిద్ధమైనట్టు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. పూర్వ ఉమ్మడి
కరీంనగర్ జిల్లాలో పవర్‌గ్రూప్‌గా చెలామణి అయిన దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు కాంగ్రెస్‌లో బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శ్రీధర్‌బాబు తండ్రి దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు సైతం కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, సహకార ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేసి, మూడుసార్లు మంథని శాసనసభ్యుడిగా ఎన్నికై శాసనసభాపతిగా కొనసాగారు. అలాగే, శ్రీధర్‌బాబు సైతం నాలుగుసార్లు మంథని నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్ఢి, కిరణ్‌కుమార్ రెడ్డి, కొణిజేటి రోశయ్య సారథ్యంలో పౌరసరఫరాల శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పలు పదవులను నిర్వర్తించారు. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికలలో మంథని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి, టీఆర్‌ఎస్ నుంచి పొటీ చేసిన పుట్ట మధూకర్‌పై శ్రీధర్‌బాబు గెలుపొందారు. ప్రస్తుతం పుట్ట మధూకర్ పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీలో పుట్ట మధుకు, శ్రీధర్‌బాబుకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు మంథని శాసనసభ నియోజకవర్గంలో నెలకొన్నాయి. అనేక సందర్భాలలో పుట్ట మధూకర్ రాజకీయ ప్రసంగాలలో శ్రీధర్‌బాబును టార్గెట్ చేసుకొంటూ విమర్శలు చేసుకున్నారు. తాజాగా మంథని నియోజకవర్గంలో చోటా మోటా నాయకులు సైతం గులాబీ గూటికి చేరికలు కొనసాగుతున్నాయి. కాగా, శ్రీధర్‌బాబు కాంగ్రెస్‌ను వీడి గులాబీ గూటికి చేరుతున్నారనే వార్తలు దావనంలా వ్యాప్తి చెందడంతో నాయకులు, కార్యకర్తలు ఎటు వైపు ఉండాలో తేల్చుకోలేక పోతున్నారు.
*చిత్రం... మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, పెద్దపల్లి జిల్లా మంథని శాసనసభ్యుడు దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు