తెలంగాణ

3న రాష్ట్ర సహకార బ్యాంక్‌కు ఎన్నిక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ (టీఎస్‌సీఏబీ) అధ్యక్ష, ఉపాధ్యక్షస్థానాలకు మార్చి 3 లేదా 4 న ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. డీసీసీబీ అధ్యక్షులంతా టీఎస్‌సీఏబీలో డైరెక్టర్లుగా ఉంటారు. రాష్టవ్య్రాప్తంగా ప్రస్తుతం 9 డీసీసీబీలు ఉన్నాయి. డీసీసీబీ డైరెక్టర్ల పోస్టులకు వాస్తవంగా శుక్రవారం ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే తొమ్మిది డీసీసీబీల్లో 180 డైరెక్టర్ల స్థానాలు ఉండగా, 148 స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. 32 డైరెక్టర్ల పోస్టులకు నామినేషనే్ల దాఖలు కాలేదు. దాంతో డైరెక్టర్ల స్థానాలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉండటం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి 45 స్థానాలు రిజర్వ్ కాగా 31 స్థానాలకు అభ్యర్థులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడ్డది. 14 మంది మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎన్నికయ్యారు.
డీసీసీబీ అధ్యక్షుడు, ఉపాధ్యక్ష స్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఒక్కో డీసీసీబీలో 20 మంది డైరెక్టర్లకు గాను కోరం (11 మంది) ఉంటే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర సహకార ఎన్నికల అధికారి, అదనపురిజిస్ట్రార్ సుమిత్ర వంగాల తెలిపారు. గురువారం సాయంత్రం ఆమె ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మట్లాడుతూ, డీసీసీబీ పాలకవర్గాల ఎన్నికలకు ఏర్పాట్లు చేశామని వివరించారు. తొమ్మిది డీసీసీబీ అధ్యక్ష స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగితే, వారే రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు డైరెక్టర్లుగా పనిచేస్తారు. వారిలోనుండి ఒకరు అపెక్స్ బ్యాంక్ అధ్యక్షుడిగా, మరొకరు ఉపాధ్యక్షుడిగా ఎన్నికవుతారు. అంటే డీసీసీబీ పాలకవర్గాల ఎన్నికల తర్వాత మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
ఇలా ఉండగా డీసీఎంఎస్‌ల డైరెక్టర్ల స్థానాలకు కూడా ఏకగ్రీవంగా డైరెక్టర్లు ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని తొమ్మిది డీసీఎంఎస్‌లలో 90 డైరెక్టర్ల స్థానాలు ఉండగా, వీటిలో 75 స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన 15 డైరెక్టర్ల స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఏకగ్రీవ ఎన్నికలు జరగడంతో డైరెక్టర్ల ఎన్నికలకోసం శుక్రవారం నిర్వహించాల్సిన ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉండటం లేదు. డీసీఎంఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్షస్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ మార్క్‌ఫెడ్‌లో మొత్తం 550 మంది సభ్యులుగా ఉంటారు. ఈ కారణంగానే మార్క్‌ఫెడ్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది.