తెలంగాణ

బీజేపీ నేతల వల్లే ఢిల్లీలో హింస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ఢిల్లీలో అల్లర్లకు బీజేపీ అనుసరించిన మొండి వైఖరి కారణమని, ఇప్పటికైనా పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని పీసీసీ మాజీ నేత వీ హనుమంతరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పౌరసత్వసవరణ చట్టం వల్ల దేశంలో మతతత్వ శక్తులు పేట్రేగుతున్నాయన్నారు. దేశ రాజధానిలో మూడు రోజుల పాటు అల్లర్లు జరిగినా పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపైన దాడులు చేస్తున్నారన్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ దాడులకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చేసిన ప్రకటనకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిందే సుప్రీంకోర్టు పేర్కొన్నాదన్నారు. ప్రధాని మోదీ ఇప్పటికైనా ఈ విషయాలపై చర్యలు తీసుకుని సీఏఏను రద్దు చేసుకోవాలన్నారు. సీఏఏ వల్లనే ఇదంతా జరుగుతోందని, తమను దేశం నుంచి బయటకు పంపుతారనే భయంతో మైనారిటీలు బతుకుతున్నారన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు.