తెలంగాణ

ఇంటర్ పరీక్షలకు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ , ఫిబ్రవరి 27: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసినట్టు విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్ తెలిపారు. మార్చి 4వ తేదీ నుండి 18వ తేదీ వరకూ జరిగే ఇంటర్ పరీక్షలకు 4,80,516 మంది ఫస్టియర్, 4,85,323 మంది సెకండియర్ విద్యార్థులు హాజరవుతున్నారని వీరి కోసం 1339 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్టుమెంటల్ ఆఫీసర్‌ను నియమించామని అన్నారు. 25,550 మంది ఇన్విజిలేటర్లను నియమించామని మొత్తం 9,65,839 మంది విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు జారీ చేశామని చెప్పారు. ఇప్పటికి ఇంకా హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోని వారు ఈ నెల 28 నుండి ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో తమ హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు. దానిపై కాలేజీ ప్రిన్సిపాల్ సంతకాలు చేయాల్సిన అవసరం లేదని, డౌన్‌లోడ్ చేసిన హాల్‌టిక్కెట్లతో పరీక్షలు రాయవచ్చని తెలిపారు. కాలేజీల్లో ఫీజులు చెల్లించలేదనే పేరుతో ఏ విద్యార్థి హాల్‌టిక్కెట్‌నూ ప్రిన్సిపాల్స్ ఆపవద్దని ఆమె చెప్పారు. విద్యార్థులు తమ పేర్లు ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకుని ముందే సరిచేసుకోవాలని అన్నారు. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలను ఏర్పాటు చేశామని, అదే విధంగా ఇంటర్ బోర్డుకు నేరుగా ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ప్రతి కాలేజీలో స్టూడెంట్ కౌన్సిలర్లను ఎంపిక చేశారని, వారి వివరాలను నోటీసు బోర్డుల్లో పెట్టాలని, తద్వారా ఏ విద్యార్థికైనా ఇబ్బంది కలిగితే వారి ద్వారా ఆ చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారని స్పెషల్ సీఎస్ పేర్కొన్నారు. విద్యార్థులు ఏ విషయానికి ఆందోళన చెందవద్దని, తమకేమైనా సమస్యలుంటే వాటిని అధికారుల దృష్టికి తేవాలని అన్నారు. అలాగే తెలంగాణ బోర్డు సెంటర్ లొకేటర్ మొబైల్ యాప్ రూపొందించిందని, తద్వారా జంబ్లింగ్ కేంద్రాల గుర్తింపు చాలా తేలిక అవుతుందని అన్నారు. పరీక్షాలు రాసిన తర్వాత ఒఎంఆర్‌లను ఇన్విజిలేటర్లకు అందజేయాలని అందులో పొరపాట్లు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని అన్నారు.
పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని, తద్వారా ట్రాఫిక్ ఇతర సమస్యలను అధిగమించాలని పేర్కొన్నారు. పరీక్ష వాస్తవంగా ప్రారంభానికి పావు గంట ముందే ఒఎంఆర్ షీట్లను విద్యార్థులకు అందజేస్తారని వాటిని ఎలాంటి తొందరపాటు లేకుండా అవసరమైన వివరాలను సరిచూసుకోవాలని చెప్పారు. గడువుముగిసిన తర్వాత విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.