తెలంగాణ

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అధికారుల సమాయత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం సమావేశం అవుతున్నారు. శాసనసభ, శాసనమండలిలో సభ్యులు అడిగే ప్రశ్నలకు, ప్రభుత్వ పరంగా జరిగే చర్చల సమయంలో అధికారిక సమాచారం అందించేందుకు వివిధ శాఖలను సిద్ధం చేయాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని తెలిసింది. ప్రభుత్వ పరంగా మంత్రులు సమాధానం ఇచ్చే సమయంలో సంబంధిత అధికారులు ఎలాంటి జాప్యం లేకుండా సరైన సమాచారం ఇవ్వాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో సచివాలయంలోని అన్ని శాఖల సిబ్బంది అందుబాటులో ఉండాలని సోమేశ్‌కుమార్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారుల సమావేశంలో వెల్లడిస్తారని తెలిసింది. ఇలా ఉండగా ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (సీఏజీ-కాగ్) నివేదికను బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభకు సమరిస్తున్నందు వల్ల దానిపై కూడా చర్చ జరిగితే తాజా సమాచారంతో సంబంధిత శాఖలన్నీ సిద్ధంగా ఉండాలన్నది సీఎస్ ఉద్దేశమని తెలుస్తోంది.