తెలంగాణ

కేటీఆర్ ఆగ్రహం.. స్పందించిన హోం మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: పటన్‌చేరు సమీపంలోని నారాయణ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఘటనలో ఆమె తండ్రితో అమానుషంగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై సస్పెండ్ వేటు పడింది. పటాన్‌చెరువులో ఆత్మహత్య చేసుకొని మరణించిన ఇంటర్ విద్యార్థిని సంధ్యారాణి తండ్రి పట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీస్ కానిస్టేబుల్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానిస్టేబుల్ శ్రీ్ధర్‌ను సస్పెండ్ చేయాలని హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సంగారెడ్డి ఇంచార్జీ ఎస్పీ చందనా దీప్తికి గురువారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో కానిస్టేబుల్ శ్రీ్ధర్‌ను ఎస్పీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై విమర్శల వెల్లువెత్తిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రితో పాటు డీజీపీని కోరారు. పుట్టేడు దుఃఖంలో ఉన్న వ్యక్తి పట్ల పోలీస్ కానిస్టేబుల్ వ్యవహిరించిన తీరును మంత్రి కేటీఆర్ ఖండించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నారాయణ ఇంటర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని సంధ్యారాణి మంగళవారం మధ్యాహ్నం భోజన సమయంలో ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ భవనంలోని బాత్రూమ్‌లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. సంధ్యారాణి మృతదేహన్ని కాలేజీ వద్దకు తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ తలెత్తింది. బందువులు, పలు విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి సంధ్యారాణి తల్లిదండ్రులు పటాన్‌చేరులోని మార్చురీ తాళాలు పగులగొట్టారు. విద్యార్థిని మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మృతదేహం ఉన్న ఫ్రీజర్‌ను తిరిగి ఆసుపత్రిలోనికి తీసుకెళ్లేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాన్ని విద్యార్థిని తండ్రి చంద్రశేఖర్ తీవ్రంగా ప్రతిఘటించారు. ఆ సమయంలో కానిస్టేబుల్ తన కాలితో పుట్టేడు దుఃఖంలో ఉన్న ఆ తండ్రి పట్ల పోలీసులు వ్యవహిరించిన తీరు దారుణమని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.