తెలంగాణ

పట్టణ ప్రగతిలో బీసీ హాస్టళ్లు, గురుకులాలను సందర్శించాలి: మంత్రి గంగుల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగతిలో బీసీ హాస్టళ్లు, గురుకులాలను అధికారులు, ప్రజా ప్రతినిధులు సందర్శించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రి బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంబీసీ కులాలకు చెందిన నిరుద్యోగ యువకులకు 5 గురికి ఒక గ్రూప్ చొప్పున ఫైలెట్ ప్రాజెక్టుగా జిల్లాకు ఒకటి చొప్పున కేసీఆర్ ఆపద్భందు పేరున అంబులెన్స్‌లను బీసీ కార్పొరేషన్ ద్వారా అందించాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన్నట్లు తెలిపారు. 10వేల మంది నిరుపేద బీసీ యువతులకు నిఫ్ట్ ద్వారా శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్లు అందజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అధికారులు బీ.వెంకటేశం, సైదా, అలోక్ కుమార్, మల్లయ్య భట్, శ్రీనాధ్ తదితరులు పాల్గొన్నారు.