తెలంగాణ

రూ.603 కోట్లు కేటాయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: కంపెనే్సటరీ అఫార్స్టేషన్ (కంపా) ఫండ్ నుండి 2020-21 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి 603 కోట్ల రూపాయలు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. తెలంగాణ రాష్ట్ర పీసీసీఎఫ్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) ఆర్. శోభ నేతృత్వంలో తెలంగాణ కంపా ఎగ్జిక్యూటివ్ కమిటీ గురువారం ఇక్కడ సమావేశమైంది. ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ, కంపా నిధుల వినియోగంలో గత ఐదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అగ్రగామిగా నిలుస్తోందన్నారు. 2014-19 మధ్య కాలంలో కంపానిధులు 645 కోట్ల రూపాయలు తెలంగాణకు రాగా వీటిలో 99 శాతం నిధులు వినియోగించామని శోభ గుర్తు చేశారు. 2019-20 సంవత్సరానికి కేటాయించిన 500 కోట్ల రూపాయలతో చేపట్టిన పనుల పురోగతిని ఈ సందర్భంగా సమీక్షించారు. కంపా నిధులతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అడవుల పునరుద్దరణ తదితర పనులకు కేంద్రం నుండి ప్రశంసలు వచ్చాయని పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్ తెలిపారు. కంపా నిధుల ఆడిటింగ్‌లో కూడా దేశంలో తెలంగాణ ముందంజలో ఉందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, అదనపు పీసీసీఎఫ్‌లు ఆర్‌ఎం డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, ఎంసీ పర్గెయిన్ తదితరులు పాల్గొన్నారు.