తెలంగాణ

ఎంఎస్‌పీ నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్) గవర్నింగ్ బాడీ సమావేశంలో మాట్లాడుతూ, భౌగోళిక వాతావరణ పరిస్థితులు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంటాయని, అందువల్ల పంటలకు ఎంఎస్‌పీ నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం గత ఐదేళ్లలో వ్యవసాయ రంగం అభివృద్ధికోసం అనేక పథకాలు, కార్యక్రమాలు రూపొందించిందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. దాంతో 2019-20 లో 130 లక్షల టన్నుల ఆహార పంటలు ఉత్పత్తి అవుతాయని అంచనావేసినట్టు వివరించారు. వ్యవసాయానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. రైతుబంధు పథకం ద్వారా పంటల పెట్టుబడికి ఎకరాకు ఐదువేల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నామని, రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటోందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేశామని, ఇప్పటికే చాలా జిల్లాల్లో ఇవి ఉపయోగంలోకి వచ్చాయన్నారు. అలాగే మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలోని చెరువులు, కుంటల మరమ్మతులను చేశామని మంత్రి తెలిపారు. అత్యాధునిక సదుపాయాలతో ఆహారోత్పత్తులపై పురుగుమందుల అవశేషాల పరిశోధనకు లాబోరేటరీలను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా రూపొందిస్తున్నామని, వివిధ రాష్ట్రాలకు, ఇతర దేశాలకు విత్తనాన్ని ఎగుమతి చేస్తున్నామన్నారు. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం గత ఐదేళ్లలో అధిక దిగుబడి ఇచ్చే వరి, మొక్కజొన్న, కందులు, పెసలు తదితర పంటల విత్తనాలను విడుదల చేసిందన్నారు. అవసరమైన రాష్ట్రాలకు కూడా తెలంగాణ విత్తనాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి హామీ ఇచ్చారు. ఆహార వినియోగ పద్ధతులపై తమ విశ్వవిద్యాలయం పరిశోధన చేసిందని, అందుకు అనుగుణంగా క్రాప్ కాలనీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జగిత్యాలలో ఏఐసీఆర్‌పీ కింద ఆవాల పంటపై ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని, అలాగే నీటి యాజమాన్యంపై కూడా పరిశోధన కోసం ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలను విస్తరిస్తూ, కొత్తగా ఏర్పాటైన అన్ని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయాలని కోరారు. కందుల ఉత్పత్తి అధికంగా ఉండటం వల్ల కందుల సేకరణకు ఇప్పటికే అనుమతించిన 47 వేల టన్నులకు తోడు మరో 50 వేల టన్నుల కందులను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రతిపాదనలకు కేంద్ర వ్యవసాయ మంత్రి సానుకూలంగా స్పందించారు.

*చిత్రం...న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి