తెలంగాణ

రియల్టీపై కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: రియల్ ఏస్టేట్ రంగానికి ఊతం ఇవ్వడానికి సరళీకృతం చేసిన భవన నిర్మాణాల అనుమతులతో పాటు ఈ రంగం ఎదుర్కొంటున్న మరికొన్ని సమస్యలను పరిష్కరించేందుకు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తూ మున్సిపల్ పరిపాలనా, పట్టణాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. హైదరాబాద్ మెట్రో డవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) కమిషనర్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సివరేజెస్ మేనేజింగ్ డైరెక్టర్, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారని మున్సిపల్ పాలనా, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎంజి గోపాల్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రియల్ ఏస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు, రాయితీలను ప్రభుత్వం ప్రకటింటిన విషయం తెలిసిందే. అయితే ఈ రంగం ఎదుర్కొంటున్న మరికొన్ని సమస్యలను ఈ రంగానికి చెందిన ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వాటిని కూడా అధ్యయనం చేసి పరిష్కరించేందుకు ఈ కమిటీని ప్రభుత్వం నియమించింది. అలాగే కమిటీ పరిశీలించే అంశాలను కూడా ప్రభుత్వం సూచించింది.
హైదరాబాద్ మెట్రో డవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ), కాకతీయ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ (కుడా) భవనాల అనుమతులను నేరుగా హెచ్‌ఎండిఎ, కుడా జారీ చేసి, వాటి ద్వారా వసూలు చేసే రుసుంను సంబంధిత గ్రామ పంచాయతీలకు పంపించడం.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో భవనాల ఎత్తుపై ఉన్న నిబంధనలను తొలగించడం
చిన్న ప్లాట్లకు ప్రస్తుతం ఉన్న కనీస వైశాల్యం సడలింపు
భవనాల ఎత్తుతో ప్రమేయం లేకుండా సెట్ బ్యాక్‌ను 2 మీటర్లకు కుదించడం.
ప్రధాన రహదారులు, కూడళ్లలో మల్టిప్లెక్స్‌ల నిర్మాణాలను అనుమతించడం.
తదితర ప్రధానమైన ఐదు అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి మూడు నెలల వ్యవధిలో నివేదిక ఇవ్వాల్సిందగా ఉత్తర్వులలో ముఖ్య కార్యదర్శి ఎంజి గోపాల్ పేర్కొన్నారు.