రాష్ట్రీయం

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం నుండి, సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ, జవాబుపత్రాల మూల్యాంకనం, డాటా సేకరణ, ఫలితాల వెల్లడి, అనంతర కార్యక్రమాలపై ఈసారి ఎన్నడూ లేని రీతిలో ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక శ్రద్ధ వహించింది. పరీక్షలకు సంబంధించి గత మూడు నెలలుగా విద్యార్థులకు కౌనె్సలింగ్ నిర్వహిస్తోంది. మరోవైపు విద్యార్థుల నామినల్ రోల్స్ విషయంలోనూ , డాటాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆన్‌లైన్‌లో ఉంచి విద్యార్థుల నుండి ఫీడ్‌బ్యాక్ తీసుకుంది. పరీక్ష కేంద్రాలకు సెంటర్ లొకేటర్ యాప్, సమస్యల పరిష్కారానికి స్టూడెంట్ కౌన్సిలర్లతో పాటు గ్రీవెన్స్ సెల్‌ను నెలకొల్పింది. ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు టెలిఫోన్ (040-24600110) ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసింది. వీటికి తోడు హెల్ప్‌డెస్క్‌ను కూడా ఏర్పాటు చేసింది. వీటన్నింటికీ మించి మూల్యాంకనంలో పాల్గొనే లెక్చరర్లకు చేయదగినవి - చేయకూడనివి అంటూ ప్రత్యేక సూచనలు అందజేసింది. గత ఏడాది జరిగిన అనేక అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్థులకు మొదటి నుండి కౌనె్సలింగ్ నిర్వహిస్తూ, వారికి విశ్వాసాన్ని పెంచేందుకు తగిన చర్యలు చేపట్టామని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ముందుగా చేరుకోవాలని, దానివల్ల ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్షలను ప్రశాంతంగా రాసేందుకు వీలవుతుందని ఆయన చెప్పారు.
ఫస్టియర్ పరీక్షలు మార్చి 4, 6, 10, 12, 14, 17, 19, 21 తేదీల్లో జరుగనున్నాయి. అలాగే సెకండియర్ పరీక్షలు మార్చి 5, 7, 11, 13, 16, 18, 20, 23 జరగనున్నాయి. మార్చి 18 నాటికి ప్రధాన పరీక్షలు ముగుస్తాయి. అంతలో లాంగ్వేజి సబ్జెక్టుల వాల్యూయేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు.
ప్రాథమిక చికిత్స ఏర్పాట్లు
పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అత్యవసర ప్రాథమిక చికిత్స ఏర్పాట్లకు వీలుగా వైద్యశాఖ సహాయాన్ని కూడా తీసుకున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. అయితే తాజాగా కరోనా వైరస్ వ్యాప్తితో
విద్యార్థులు ఆందోళన పడనక్కర్లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. కాగా, మరోపక్క రాజధానిలోని పలు ప్రైవేటు పాఠశాలలు సెలవులు ప్రకటించాయి.
విద్యార్థులు వీలైనంత వరకు సొంత వాహనాలపై ప్రయాణాలు చేయడం ఉత్తమమని, రద్దీగా ఉండే బస్సుల్లో ప్రయాణాలు చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. అస్వస్థత భావన ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అపరిచితులకు దూరంగా ఉండాలని, దుమ్ము, ధూళి ప్రాంతాల్లో ఎక్కువగా తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని వారు పేర్కొంటున్నారు.