ఉన్నత విద్యా మండలి ముందు ఎబివిపి ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జులై 22: ఎంసెట్-2 పేపర్ లీకేజి దోషులను కఠినంగా శిక్షించాలని ఎబివిపి నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని ఉన్నత విద్యా మండలి ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప, జాతీయ కార్యవర్గ సభ్యులు ఎం. రాఘవేందర్, నగర కార్యదర్శి జె. దిలీప్, జోనల్ ఇన్‌ఛార్జీలు సురేష్, చైతన్య, శ్రీహరి, శ్రీశైలం, జీవన్, శ్రీరామ్ ప్రభృతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంసెట్-2 పేపర్ లీకేజికి నైతిక బాధ్యత వహిస్తూ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి లక్ష్మారెడ్డి, ఉన్నతాధికారులు పాపిరెడ్డి, రమణారావు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యా రంగాన్ని గాలికి వదలి వేశారని వారు విమర్శించారు. ఇంజనీరింగ్ యజమాన్యాలు ఇష్టారాజ్యంగా ‘బి’ కేటగిరి సీట్లను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నా, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని వారు విమర్శించారు.