తెలంగాణ

తప్పు చేస్తే ప్రజలు గెలిపించేవారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణ సాధన వెనుక ఎంతో కష్టం ఉందని, తెలంగాణ సాధించిన తర్వాత కూడా దానినో విఫల ప్రయోగంగా చూపించాలని చాలా మంది ప్రయత్నించారని, అయినా తాము ప్రజల మన్ననలను అందుకున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పేర్కొన్నారు.
శనివారం నాడు శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2014 తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో తాము అద్భుత విజయాలు సాధించామని, ఒక్కో మారు తమ గెలుపు చూస్తే తమకే ఆశ్చర్యం కలుగుతోందని చెప్పారు. తప్పు చేస్తే తమను ప్రజలు గెలిపించే వారు కాదని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభలో వినే ఓపిక ఉండాలని, అభిప్రాయాలు పరస్పరం పంచుకోవాలని, ఆక్రోశం వెల్లగక్కితే సరిపోదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ సాధన నేపథ్యాన్ని శాసనసభలో వివరించారు.
గెలుపు ఓటమిలు సహజంగా జరిగే ప్రక్రియ అని , శాశ్వతంగా అదికారంలో ఉన్న వారు లేరని అన్నారు. ఇందిరాగాంధీ సైతం జయప్రకాశ్ నారాయణ్ చేతిలో వోడిపోయారని, ఎన్టీఆర్ సైతం కల్వకుర్తిలో ఓటమి పాలయ్యారని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చాలా నిరాశ, నిస్పృహలో , దుస్థితిలో ఉందని అన్నారు. ఏం చేయాలో కాంగ్రెస్‌కు పాలుపోవడం లేదని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో వారి ఓట్లు 4 శాతానికి పడిపోయాయని, ఒక్క సీటు కూడా రాలేదని, అయినా కాంగ్రెస్‌లో పశ్చాత్తాపం లేదని అన్నారు. సమయం కలిసిరానపుడు సహనం ప్రదర్శించాలని చెప్పారు. అంతే తప్ప కాంగ్రెస్ నేతలు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని , పూర్తి అసత్యాలు పలుకుతున్నారని అన్నారు. తెలంగాణ సాధన సమయంలో ఇక తెలంగాణ రాదనే నిరాశ, నిస్పృహలో ఉన్నపుడు తాను నడుంబిగించానని అన్నారు. తెంలగాణ అనే మాట ఉచ్ఛరించవద్దని ఆనాటి స్పీకర్ దుర్మార్గ ఆదేశాలు ఇచ్చారని, ఆనాటి కృషి అంతా ఒక సినిమా రీలులా తిరుగుతాదని అన్నారు. కక్షగట్టి పార్టీని చీల్చే ప్రయత్నాలు చేశారని, ఎన్నో ప్రతికూలతల మధ్య తాము తెలంగాణ సాధించామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఎన్నికలు వద్దని చెప్పామని, అపాయింటెడ్ డేట్ ఖరారు కాలేదని రెండు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించారని ఆ తర్వాత కూడా ఎన్నో కుట్రలు జరిగాయని చెప్పారు. 2014లో 63 సీట్లు గెలిస్తే 2018లో 88 సీట్లుతో గెలిచామని, తాము తప్పు చేసి ఉంటే మళ్లీ గెలిచేవారమా అని ప్రశ్నించారు. గెలిచే అవకాశం లేకపోతే ముందస్తుగా అసెంబ్లీ ఎందుకు రద్దు చేస్తామని అన్నారు. సింగిల్ విండో ఎన్నికల్లో 94 శాతం సీట్లు గెలిచామని, ఈ రోజుకి కూడా టీఆర్‌ఎస్‌కు ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తున్నారో కాంగ్రెస్‌కు అర్ధం కావడం లేదని అన్నారు.
ఎంత సేపూ రాజకీయాలే వారు మాట్లాడుతున్నారని చెప్పారు. అన్ని సీట్లూ మావైనపుడు వారి సభ్యులను ఎందుకు కిడ్నాప్ చేస్తామని నిలదీశారు. వారు వచ్చి కాళ్లు పట్టుకున్నా ఆ పనిచేయబోమని అన్నారు. జిల్లాల సంఖ్య పెంచితే, వద్దని వారే మాట్లాడారని, కాంగ్రెస్ సభ్యులే కొంత మంది కావాలని మాట్లాడారని గుర్తుచేశారు. అన్ని పనులకూ కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడతారని, వారే జాప్యం జరుగుతోందని ఆరోపిస్తారని అన్నారు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో సహనశీలత చాలా అవసరమని, ప్రజలు ఎన్నడూ వోడిపోరని, పార్టీలూ, నేతలే ఓడిపోతారని అన్నారు.
రాజగోపాల్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోండి
శాసనసభలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నీ అసత్యాలు చెప్పారని, అలాంటి వ్యక్తులు సభలో కొనసాగడానికి వీలు లేదని ఆయనపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలని వారికి గుణపాఠం రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సభాపతిని కోరారు. ఈ సందర్భంగా ఆయన పలు డాక్యుమెంట్లను స్పీకర్‌కు అందజేసి, రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు చేపట్టాలని , ఉదాసీనత వద్దని సూచించారు.