తెలంగాణ

సమైక్య పాలనపై తిట్ల దండకం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో తాము గత ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్భ్రావృద్ధికి ఏమి చేశామో చెప్పకుండా, సమైక్యపాలపై విమర్శలు చేయడం అప్రస్తుతమని కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనసూయ మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో సీఎం కేసీఆర్‌ను పొగిడే కార్యక్రమం తప్ప మరొకటి లేదన్నారు. సమైక్యపాలనలో అధికారంలో భాగస్వామం ఉన్న వారే ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. గత ఆరేళ్లలో మీ ప్రభుత్వం ఎటువంటి ప్రగతి సాధించిందో తెలియచేయాలన్నారు. సమైక్యపాలకులు రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చి వెళ్లారన్నారు. ధనిక రాష్టమ్రని చెప్పుకుంటూ తెలంగాణను అప్పులు పాలు చేశారన్నారు. డీఎస్‌సీ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వలేదన్నారు. మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయన్నారు. మద్యం ఏరులై పారుతోందని, గల్లీ గల్లీకి బెల్ట్‌షాపులు వచ్చాయన్నారు. డి అడిక్షన్ సెంటర్లు ఎన్ని పెట్టారని, ఎంత మందికి వైద్య సేవలు అందించారన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను ఎన్ని నిర్మించారాన్నారు. దళతులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. రైతు బంధు పథకం సరిగా అమలు కావడం లేదన్నారు. అటవీ భూముల చట్టాల పేరుతో గిరిజనుల పోడు వ్యవసాయాన్ని దెబ్బతీశారన్నారు. సంపద సృష్టించకుండా, అప్పులు పెంచుతున్నారన్నారు. గత గవర్నర్ మాదిరిగా ప్రస్తుత గవర్నర్ గుడులు, గోపురాలు చుట్టూ తిరగకుండా ఉండడం ఆనందం కలిగించే అంశమన్నారు.
రైతుల ఆత్మహత్యలను నిరోధించండి:
* బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలను నిరోధించాలన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. ఆత్మహత్య చేసుకున్న వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని వాస్తవాలతో బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడాలని కోరారు. అనంతరం రాజాసింగ్ మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు తమ ప్రాణాలను అర్పించారని, వారి కుటుంబాలకు ఏమి చేశారో తెలియచేయాలనికోరారు. ఉద్యోగులకు పదవీవిరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచుతామని చెప్పి అమలు చేయలేదన్నారు. ఆంధ్రాలో ఉద్యోగులకు 27 శాతం మద్యంతర భృతి ఇచ్చారన్నారు. ఎంత మందికి డబుల్‌బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇచ్చారని ఆయన నిలదీశారు.