తెలంగాణ

సంక్షేమానికి పెద్దపీట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: 2020-21 వార్షిక బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేశామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఆర్థిక మాంద్యం ఉన్నా, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు కోత పెట్టినా సంక్షేమ రంగానికి తగ్గించక లేదని ఆయన గుర్తు చేశారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బడ్జెట్‌లో ప్రభుత్వ ప్రాధాన్యతలు, కేంద్ర నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర సొంత ఆదాయాన్ని పెంచుకోవడానికి తీసుకోబోయే చర్యలను శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి మంత్రి హరీశ్‌రావు మీడియాకు వెల్లడించారు. సంక్షేమ రంగానికి గతంలో కంటే ఈసారి నిధులు పెంచామన్నారు. ఆసరా పథకానికి గతంలో రూ.9,400 కోట్లు కేటాయించగా ఈసారి 25 శాతం పెంచి రూ.11,758 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఆసరా ద్వారా ఇప్పటికే 40 లక్షల మందికి పెన్షన్ ఇస్తుండగా 57 ఏళ్లు నిండిన వారికి కూడా దీనిని వర్తింప జేయడానికి నిధులు పెంచామన్నారు. కల్యాణలక్ష్మి పథకానికి గత బడ్జెట్‌లో రూ.1,040 కోట్లు కేటాయించగా ఈసారి వాటిని రూ.2,240 కోట్లకు పెంచామన్నారు. గురుకుల పాఠశాలలకు గతంలో రూ.1,963 కోట్లు కేటాయించగా ఈసారి వాటిని 2,015 కోట్లకు పెంచామన్నారు. ప్రస్తుతం గురుకుల పాఠశాలల్లో 4 లక్షల 41 వేల 495 మంది విద్యార్థులు చదువుకొంటుండగా మరో 53 వేల మంది విద్యార్థుల సంఖ్య పెరగబోతుందని నిధులు పెంచామన్నారు. పారిశ్రామిక అభివృద్థి కోసం తీసుకొచ్చిన టీఎస్-ఐపాస్‌కు మంచి ఆదరణ లభించడంతో వౌలిక వసతుల కల్పనకు గతంలో రూ.75 కోట్లు కేటాయించగా ఈసారి దానిని రూ.1,500 కోట్లకు పెంచామన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను సొంత స్థలాల్లో నిర్మించుకోవడానికి ముందుకు వచ్చే వారి కోసం బడ్జెట్‌లో రూ. 10,500 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి కూడా డబుల్ బెడ్‌రూమ్ పథకం వర్తిస్తుందని తాము ఎన్నికల ప్రణాళికలోనే హామీ ఇచ్చినట్టు మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంలో మార్కెట్‌లో ఒడిదుడుకులు లేకుండా రైతులను ఆదుకోవడానికి మార్కెట్ ఇంటర్‌వెన్షన్ నిధి కింద రూ.1,500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లను తగ్గించినప్పటికీ సంక్షేమ రంగానికి ఎక్కడా నిధులు తగ్గించకపోగా ఈసారి ఇంకా పెంచామని తెలిపారు. ఈసారి బడ్జెట్‌లో హైదరాబాద్ నగర అభివృద్ధికి మునుపెన్నడూ లేనివిధంగా రూ.10 వేల కోట్లు కేటాయించడం
మరో విశేషమని చెప్పారు. మిషన్ భగీరథ పనులు ఇంకా 38 పట్టణాల్లో మిగిలిపోవడంతో బడ్జెట్‌లో నేరుగా రూ.800 కోట్లు కేటాయించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరగడంతో పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడానికి రూ.300 కోట్లు కేటాయించామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 150 కిలో మీటర్ల పొడవునా నిరంతరం గోదావరి కాలువల్లో నీరు పారుతుండడంతో బోటింగ్, రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేపట్టనున్నట్టు తెలిపారు. హరితహారానికి రూ.300 కోట్లు, అందరికీ విద్య పథకానికి రూ.100 కోట్లు ఈసారి కొత్తగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినట్టు మంత్రి హరీశ్‌రావు వివరించారు.
కేంద్రం నుంచి ఇంకా నిధులు రావాలి
కేంద్రం నుంచి ఇంకా రాష్ట్రానికి వివిథ పదుద్ల కింద దాదాపు రూ.3 వేల కోట్ల వరకు నిధులు రావాల్సి ఉందని మంత్రి హరీశ్‌రావు వివరించారు. జీఎస్‌టీ ఆదాయం 14 శాతం కంటే తగ్గిన రాష్ట్రాలకు లోటును భర్తీ చేయడానికి కేంద్రమే నిధులు కేటాయిస్తుందన్నారు. ఈ పద్దు కింద రాష్ట్రానికి 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.933 కోట్లు రావాల్సి ఉందన్నారు. అలాగే 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రూ.735 కోట్లు రావాల్సి ఉందన్నారు. సీజీఎస్‌టీ పన్నులపై రాష్ట్రానికి రూ.2,300 కోట్ల వరకు రావాల్సి ఉందని మంత్రి హరీశ్‌రావు వివరించారు.

*చిత్రం... శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు