తెలంగాణ

విషంతోనే మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారి, ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు తిరునగరు మారుతీరావువిషం తీసుకోవడం వల్లే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ మేరకు పోస్టుమార్టం రిపోర్ట్‌లో వైద్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. మారుతీరావు శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మృతుడి శరీరంపై ఎటువంటి గాయాలూ లేవని, గారెల్లో విషం పెట్టుకుని తినడం వల్లే అతను చనిపోయాడని రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
విషం శరీరం మొత్తం వ్యాపించడంతో అవయవాలు పనిచేయకుండా ఆగిపోయాయని, రక్తప్రసరణ కూడా నిలిచిపోవడంతో బ్రెయిన్ డెడ్ అయిందని, అంతేకాకుండా కార్డియాక్ అరెస్ట్ అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా, మారుతీరావు తీసుకున్న విస్రా శ్యాంపిల్స్‌ను ఫోరెన్సిక్ వైద్యులు సేకరించారు. విస్రా ఎనరాలసిస్‌లో మారుతీరావు ఎలాంటి విషం తీసుకున్నాడో తెలుస్తుందని వైద్యులు తెలిపారు.