తెలంగాణ

ఐసిస్‌లో చేరడానికే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకే నాగపూర్ నుంచి శ్రీనగర్ వెళ్లామని, అక్కడినుంచి సిరియా వెళ్లాలనుకున్నామని ‘సిట్’ అధికారుల విచారణలో నిందితులైన ఇంజనీరింగ్ విద్యార్థులు అంగీకరించారు. చంచల్‌గూడలో ముగ్గురు విద్యార్థులను స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీం అధికారులు మూడు రోజులుగా విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన బాసిత్, ఫారూఖ్, ఒమర్ హసన్ గతనెల డిసెంబర్ 25న సిరియా వెళ్ళేందుకు బయలుదేరి నాగపూర్ విమానాశ్రయంలో పట్టుబడిన విషయం విదితమే. ఉగ్రవాద భావజాలంపై మక్కువతో ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రవాద సంస్థలో చేరాలని నిశ్చయించుకున్నామని, చాలామందితో టచ్‌లో ఉన్నామని విద్యార్థులు తెలిపినట్టు ఓ సీనియర్ అధికారి చెప్పారు. హైదరాబాద్ నుంచి ఎంతో మంది విద్యార్థులు ఐసిస్‌లో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారని సిట్ విచారణలో విద్యార్థులు చెప్పినట్టు తెలిసింది. అయితే ఆ విద్యార్థులు నగరంలోని ఏఏ కళాశాలలకు చెందినవారు, ఎక్కడి ప్రాంతానికి చెందిన వారు, ఎంత మంది చేరాలనుకుంటున్నారు అన్న విషయం చెప్పడం లేదని విశ్వసనీయ సమాచారం. నాగపూర్ నుంచి శ్రీనగర్ వెళితే అక్కడి నుంచి అఫ్గానిస్తాన్ మీదుగా సిరియా వెళ్లేందుకు మార్గం సులువేనని వారు పేర్కొన్నట్టు తెలిసింది. శ్రీనగర్ వెళితే అక్కడ పోలీసులు, మిలిటెంట్లు మినహా ఎవరూ ప్రజలను కలుసుకోరని, ప్రతి వారికి అక్కడ ఏదో రకమైన గుర్తింపు కార్డు తప్పనిసరని, అయితే తాము విద్యార్థులం కాబట్టి తమ వద్ద ఐడి కార్డులుంటాయని, దీంతో ఉగ్రవాద సంస్థలకు చెందిన మిలిటెంట్లను కలుసుకొని సిరియా వెళ్లాలనుకున్నామని విద్యార్థులు తమ నేరాంగీకార పత్రంలో పేర్కొన్నట్టు ఓ సీనియర్ అధికారి చెప్పారు. విద్యార్థులను కోర్టు ద్వారా మరికొన్ని రోజులు తమ కస్టడీలోకి తీసుకొని విచారించన్నుట్టు ఆ అధికారి పేర్కొన్నారు. కాగా వీరిపై దేశద్రోహం కేసు నమోదు చేసినట్టు తెలిసింది.