తెలంగాణ

గాంధీలో అ‘టెన్షన్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, మార్చి 9: గాంధీ ఆసుపత్రికి రోజురోజుకి కోవిడ్ అనుమానిత లక్షణాలతో వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రజల్లో భయాందోళనలు రెట్టింపు కావటంతో జలుబు, దగ్గు వంటి స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా గాంధీలోని కోవిడ్ వార్డుకు చేరుకుంటున్నారు. ఇందులో ట్రావెల్ హిస్టరీ లేని వారిని గుర్తించి వారికి వైద్యులు కౌనె్సలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. చైనాలో ఈ వైరస్ వెలుగుచూసినప్పటి నుంచి ఇప్పటి వరకు 259 మంది అనుమానితులు గాంధీ ఆసుపత్రికి రాగా, వారిలో మహేంద్రహిల్స్ రవీకాలనీకి చెందిన ఒక యువకుడికి మాత్రమే పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే! మిగిలిన వారందరికీ నెగెటివ్ రిపోర్టులు రావటంతో వారిని ఇంటికి పంపించేస్తున్నట్లు కోవిడ్-19 నోడల్ ఆఫీసర్ డా.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం కోవిడ్ అనుమానిత లక్షణాలతో మరో ఎనిమిది మంది వచ్చారని, వారిని ఐసోలేటెడ్ వార్డులో చేర్చుకొని చికిత్స అందిస్తున్నామని, రక్తం నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపించినట్లు తెలిపారు. సోమవారం వచ్చిన ఎనిమిది మందితో పాటు ఇప్పటికే మరో 17 మంది, మొత్తం 25 మందిని ఐసోలేటెడ్ వార్డులో ఉంచి, చికిత్స అందిస్తున్నామని తెలిపారు. పాజిటివ్ రిపోర్టు వచ్చిన మహేంద్రహిల్స్ వాసి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని.. మెల్లమెల్లగా కోలుకుంటున్నట్లు తెలిపారు. కేవలం ఇతర దేశాలకు వెళ్లి వచ్చినట్లు ట్రావెల్ హిస్టరీ కలిగి, కోవిడ్ అనుమానిత లక్షణాలున్న వారికి మాత్రమే కోవిడ్ నిర్దారణ పరీక్షలు గాంధీలో జరుపుతామని అన్నారు. ఇతర అనారోగ్య లక్షణాలతో వచ్చిన వారికి గాంధీలో కోవిడ్ పరీక్షలు చేయటం అనేది గాంధీ ఆసుపత్రిలో ఎట్టి పరిస్థితిల్లోనూ కుదరదని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు.