తెలంగాణ

దత్తాత్రేయకు స్వల్ప అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారం నాడు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. వెంటనే సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలోని వైద్యుల బృందం దత్తాత్రేయకు పలు పరీక్షలు నిర్వహించారు. దత్తాత్రేయ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి జేఎండీ సంగీత రెడ్డి చెప్పారు. నిత్యం చేసుకునే పరీక్షల్లో భాగంగానే ఆయన అపోలో ఆస్పత్రికి వచ్చారని వైద్యులు పేర్కొన్నారు. వాస్తవానికి ఆయన సోమవారం ఉదయం ఇటీవల మృతి చెందిన ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించాల్సి ఉంది. అనంతరం ఆయన హిమాచల్ ప్రదేశ్‌కు పయనం కావల్సి ఉండగా, అంతలోనే అస్వస్థతకు గురికావడంతో ఆయన అపోలో ఆస్పత్రికి వెళ్లారు. ఆదివారం రాత్రి నుండే దత్తాత్రేయ కొంత అలసటగా ఉన్నారని ఆయన అనుచరులు పేర్కొన్నారు. గత వారం రోజులుగా నిలకడగా లేకుండా అనేక కార్యక్రమాల్లో పాల్గొనడంతోనే ఆయన అస్వస్థతకు గురయ్యారని వారు చెప్పారు. కాగా సోమవారం సాయంత్రం ఆస్పత్రి నుండి డిశ్చార్జి చేసినట్టు వైద్యులు తెలిపారు. అనంతరం అనేక మంది నేతలు ఆయనను కలిసి పరామర్శించారు.

*చిత్రం... అపోలో ఆసుపత్రి వద్ద డిశ్చార్జ్ అనంతరం అభిమానులకు అభివాదం చేస్తున్న దత్తాత్రేయ