తెలంగాణ

రేపటి నుంచి ఎన్‌ఆర్‌ఈజీఎస్ క్షేత్ర సహాయకుల నిరవధిక సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి: వలసల నివారణ, చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఒక్కసారిగా స్తంభించనున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ క్షేత్ర సహాయకులు (ఎఫ్‌ఏ) ఈనెల 12వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె నోటీసును అందజేసినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పాత జిల్లాల్లో పనిచేస్తున్న సుమారు పది వేలకుపైగా ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెబాట పట్టనున్నారు. హైదరాబాద్ నగరం మినహాయిస్తే అన్ని జిల్లాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ప్రతి వేసవి కాలంలో జోరుగా కొనసాగుతాయి. కొత్తగా ఏర్పాటైన జిల్లాలవారీగా ఒక్కో జిల్లాలో లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీలు జాబ్ కార్డులు కలిగివున్నారు. రాష్టవ్య్రాప్తంగా కోటి మందికి పైగా జాబ్ కార్డులు పొందివున్నట్టు స్పష్టమవుతోంది. జాబ్ కార్డు కలిగిన కూలీ ద్వారా ప్రతి యేటా వంద రోజుల పని దినాల్లో కనీసం 30 రోజులు పనులకు హాజరు అయ్యేలా ప్రోత్సహించే ఫీల్డ్ అసిస్టెంట్లను మొదటి తరగతి కింద పరిగణించి నెలకు రూ.10 వేల వేతనం, వందరోజుల్లో 20 నుండి 29 రోజులు పనిచేయించిన ఎఫ్‌ఏలను ద్వితీయ శ్రేణిగా భావిస్తూ నెలకు రూ.9 వేల జీతం, వంద రోజులకు కనీసం 10 నుండి 19 రోజులు పనుల చేయించిన క్షేత్ర సహాయకులకు నెలకు రూ.7 వేల జీతం చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. వంద రోజుల పనిదినాల్లో పది రోజులకన్నా తక్కువగా పని చేయించిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగం నుండి తొలగింపు అనే షరతును సదరు ఉద్యోగులు జీర్ణించుకోవడం లేదు. ఒక్కో కూలీకి రోజుకు రూ.211 కూలీ గిట్టుబాటు కాకపోవడంతో ఉపాధి పనులకు హాజరయ్యేందుకు విముఖత చూపిస్తున్నారని, బయట పనులకు వెళితే రోజుకు కనీసం రూ.400 నుండి రూ.500 కూలీ గిట్టుబాటు అవుతుండటంతో ఇతర పనులకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని, ఇందులో తమతప్పేమిటన్న వాదనలు వినిపిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా పనులు చేయిస్తున్న తమను ప్రభుత్వం లేనిపోని నిబంధనలు పెట్టి ఉద్యోగాల నుండి తొలగించడానికి ప్రయత్నిస్తోందని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆరోపిస్తున్నారు. పనులతో ప్రమేయం లేకుండా నిర్దిష్టమైన వేతనాన్ని చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆరోగ్య బీమా సౌకర్యం ఇవ్వాలనే తదిత ర డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి ఫీల్డ్ అసిస్టెంట్లు ఇరవైరోజుల క్రితమే సమ్మె నోటీసు ఇచ్చారు. ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈనెల 12వ తేదీ నుండి ఎఫ్‌ఏలు సమ్మెకు ఉపక్రమించడం అనివార్యంగా కనిపిస్తుంది.
ఎన్‌ఆర్‌ఈజీఎస్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులకు అనుసంధానమై ఉండటంతో కోట్లాది రూపాయలతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు ఒక్కసారిగా స్తంభించే అవకాశం కనిపిస్తోంది. గడచిన ఖరీఫ్‌లో సరైన వర్షపాతం నమోదుకాకపోవడంతో వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో ఉపాధి పనుల కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడిప్పుడే వేసవికాలం ప్రారంభమవుతుండగా, కూలీలకు ఉపాధి పనులు కల్పించాల్సిన ఎఫ్‌ఏలు సమ్మెకు దిగితే చాలామంది కూలీలకు పనులు లభించడం కష్టతరంగా మారుతోంది. క్షేత్ర సహాయకుల సమ్మె అనివార్యమైతే ప్రత్యామ్నాయంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పనులను అప్పగించే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం నెలకొంది. పనులను ఏ విధంగా కొనసాగించాలన్న అయోమయం సంబంధిత శాఖ అధికారుల్లో నెలకొనగా, తర్జనభర్జన పడుతున్నారు. ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు.

*ఉపాధి హామీ పథకం పనులు నిర్వహిస్తున్న కూలీలు (ఫైల్)