తెలంగాణ

ప్రచారానికి ‘పోషణ్ అభియాన్’ నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10:కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ‘పోషణ్ అభియాన్’ కార్యక్రమానికి కేటాయించిన నిధులు సంబంధిత ఇతర పనులకు వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి డి. దివ్య పేరుతో మంగళవారం జీఓ (ఆర్‌టీ నెంబర్ 14) జారీ అయింది. అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు ఉపయోగించే ఇంటర్నెట్ సర్వీసులకు, ఐడియా, ఓడాఫోన్ నెట్‌వర్క్‌లకు చెల్లించాల్సిన మొబైల్ ఫోన్ బిల్లుల బకాయిల చెల్లింపునకు, ప్రచారం (ఐఈసీ) కి, మొబైల్ ఫోన్లను కోనుగోలు చేసేందుకు, ఇన్నోవేషన్ ఫండ్‌కోసం, ఫ్లెక్సీల ఫండ్‌కోసం ఈ నిధులను ఉపయోగించుకోవచ్చని జీఓలో స్పష్టం చేశారు.
ఈ అంశంపై సంబంధిత కమిషనర్ వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.