తెలంగాణ
ప్రభుత్వ ఆస్తులు, మద్యం, భూముల అమ్మకాల ద్వారా ఆదాయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మార్చి 10: తెలంగాణ బడ్జెట్‌ను చూస్తే వాస్తవికతను దాచి, భూములు, ప్రభుత్వ ఆస్తులు, మద్యం అమ్మకం ద్వారానే వచ్చే ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని బడ్జెట్‌ను రూపొందించినట్లు స్పష్టంగా అర్థమవుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ రూ. 1.82లలక్షల కోట్లకు బడ్జెట్‌ను ప్రతిపాదిస్తే, అప్పుల ద్వారా రూ. 30వేల కోట్లు, పనే్నతర ఆదాయం రూ. 30వేల కోట్లు , మద్యం అమ్మకాల ద్వారా రూ. 20వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనావేశారన్నారు. తెచ్చిన అప్పులపై ఈ ఏడాది రూ. 15వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వమే పేర్కొందన్నారు. ప్రభుత్వం ఆస్తుల అమ్మకం మీదే దృష్టి పెట్టింది తప్ప, ఆస్తుల సృష్టిపై శ్రద్ధలేదని స్పష్టమవుతుందన్నారు. కల్వకుర్తి లిప్ట్‌కు రూ. 500 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదిస్తే , రూ. 2.29 కోట్లను కేటాయించారన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించి రూ. 1653.81 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. శ్రీశైలం లిఫ్ట్ బ్యాంక్ కెనాల్ పూర్తిలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
రూ. 3152.72 కోట్లతో పనులు చేస్తుండగా, మరో వెయ్యి కోట్ల వరకు పనులు పెండింగ్‌లో ఉన్నా, రూ. 3.16 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థలకు రాష్ట్రప్రభుత్వం రూ. 20వేల కోట్ల బకాయిలు ఉంటే, బడ్జెట్‌లో రూ. 10వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఆసరా పెన్షన్ల కింద ఏడు లక్షలకుపైగా లబ్థిదారులను తొలగించారన్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారన్నారు. మంత్రులు ఒకసారి బడ్జెట్‌ను అధ్యయనం చేస్తే వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుస్తుందన్నారు. ప్రభుత్వానికి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మద్యం అమ్మకాల ద్వారా రూ. 7వేల కోట్ల ఆదాయం ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో రూ. 21వేల కోట్లకు పెంచారన్నారు. యువతకు నిరుద్యోగ భృతికి రూ. 3016 ఇస్తామని ప్రకటించి, బడ్జెట్‌లో ఆ పథకానికి నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపించారన్నారు.