తెలంగాణ

అభివృద్ధికి నిదర్శనం.. అమెరికా- భారత్ సత్సంబంధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలైన భారత్, అమెరికా మధ్య ఉన్న మంచి సంబంధాలు ఇరుదేశాల అభివృద్ధికి, ప్రపంచ శాంతికి సహకరిస్తాయని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన అమెరికా కాన్సులేట్ నానక్‌రాంగూడలో నిర్మిస్తున్న నూతన కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి సంబందించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక మిలియన్లల డాలర్లతో నిర్మిస్తున్న ఈ కార్యాలయం వచ్చే సంవత్సరానికి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ మేరకు భారత్‌లో అమెరికా రాయబారి కెనె్నత్ జస్టర్ చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు. రెండు దేశాల మధ్య సంబంధాల కోసం అమెరికా అధ్యక్షు ట్రంప్, ప్రధాని మోదీ ఈ దిశగా కృషి చేస్తున్నారన్నారు. తాజాగా ఇండియాలో పర్యటన విజయవంతానికి భారత్‌లో అమెరికా రాయబారి కెనె్నత్ జేస్టర్ కృషి చేశారన్నారు. టాప్లింగ్ అవుట్ కార్యక్రమం సందర్భంగా ఇందులో పాల్గొన్న కార్మికులకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. డక్కన్ పీఠభూమి నిర్మాణ శైలిని, ఇక్కడి సహజత్వానికి దగ్గరగా డిజైన్ రూపొందించిన అమెరికన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపారు. ఇక్కడి కాన్సుల్ జనరల్ కార్యాలయానికి హైదరాబాద్ నగర సంస్కృతి సాంప్రాదాయాలకు ఒక చిహ్నంగా నిలుస్తుందన్నారు. అమెరికా రాయబారి గతంలో అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారని ఆయన గుర్తు చేశారు. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. పొరుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ఈ జనరల్ కార్యాలయం ద్వారా సేవలు అందుతాయన్నారు. రానున్న రోజుల్లో అమెరికా, తెలంగాణ మధ్య ధృడమైన బంధం ఏర్పడుతుందని ఆయన ఆకాక్షించారు.

*చిత్రం...అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్