తెలంగాణ
కోవిడ్‌పై విద్యార్థులకు అవగాహన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మార్చి 10: కరోనా వైరస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బందితో టీ-సాట్ స్టూడియో నుండి మంగళవారం ఆరోగ్య కుటుంబ శాఖ ఉన్నతాధికారులు మాట్లాడారు. కరోనాపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకోసం మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు, అనుమానితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకున్నదని, అందువల్ల ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. జలుబు, దగ్గు, జ్వరం తదితరాలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే 104 కు ఫోన్ చేసి సలహాలు తీసుకోవాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ సూచించారు. శ్వాసకోస ఇబ్బంది ఎక్కువగా ఉన్నప్పుడు, విదేశాల నుండి వచ్చిన వారు మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్ బాబు, మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ పి. రాజీవ్, యూనిసెఫ్ ప్రతినిధి శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మంగళవారం ప్రసారమైన ‘కరోనా వ్యాధి సోకకుండా తగిన జాగ్రత్తలు’ అన్న కార్యక్రమానికి యూట్యూబ్‌లో విశేష ఆధరణ లభించిందని టీ-సాట్ సీఈఓ ఆర్. శైలేష్ రెడ్డి పేర్కొన్నారు.
*చిత్రం...తరగతి గదిలో టీ-సాట్ నెట్‌వర్క్ చానెల్‌ను తిలకిస్తున్న విద్యార్థులు