తెలంగాణ

ఇళ్ల నిర్మాణాలపై రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12:రాష్ట్రంలో పేదవాళ్ల ఇళ్ల నిర్మాణాలపై ఇటు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అటు కాంగ్రెస్ పక్ష నేత జీవన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఒకరిపై నొకరు తమ పట్టుసాధించుకోవడానికి ఇళ్ల నిర్మాణాలపై రగడకు దిగారు. గురువారం శాసన మండలి సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో పేదవాళ్ల ఇళ్ల నిర్మాణాలపై చర్చ ఆశక్తిగా మారింది. రాష్ట్రంలో విపత్తులు జరిగినప్పుడు పేదవాళ్ల ఇళ్లు కూలిపోతే (్భరీ వర్షాలు,అగ్నిప్రమాదాలు, భూకంపాలు) ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని, గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు ఇచ్చే సాంప్రదాయం ఉండేదని జీవన్‌రెడ్డి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి సూచించారు. దీంతో ఇందిరమ్మ ఇళ్లంటేనే బోగస్ రికార్డులు సృష్టించిన ఘనత కాంగ్రెస్‌దేనని మంత్రి ఘాటుగా జీవన్‌రెడ్డికి సమాధానం చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. గతాన్ని చెప్పడం కాదు మీరు చేస్తున్న ఘనకార్యం ఏమిటో చెప్పుకోలేక కాంగ్రెస్‌పై పడి ఏడవడం ఎందుకని జీవన్‌రెడ్డి బదులు సమాధానం చెప్పారు. సీఎం కేసీఆర్ అట్టహాసంగా జగిత్యాలలో 4వేల ఇళ్లకు శంకుస్థాపన చేశారని, అయితే రెండుపడకల ఇళ్లు పనులు జరగనేలేదని మండలి దృష్టికి జీవన్‌రెడ్డి తీసుకువచ్చారు. అందకు మంత్రి సమాధానం చెబుతూ రెండుపడకల గదుల నిర్మాణాలు ఆదరాబాదరగా చేపట్టలేదని చెబుతూ జగిత్యాలలో 4వేల ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్ పనులు చేయడంలో జాప్యం చేశారని, అయితే జాప్యం ఎందుకో తెలుసుకుని, కొత్త కాంట్రాక్టర్‌ని ఎంపిక చేయడమో లేక పాత కాండ్రాక్టర్‌తో పనులు చేయించడం జరుగుతుందని మంత్రి చెప్పారు. జగిత్యాలలో ఇళ్ల నిర్మాణానికి కేవలం రూ.30 లక్షలు మాత్రమే ఖర్చు చేశామన్నారు. దీంతో ఇరువురి మధ్య రగడ సద్దుమణిగింది. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు దాదాపు 4.8లక్షల నిర్మాణాలు జరగగా అందులో లక్షా 30వేల ఇళ్లు బోగస్ రికార్డులుగా బయటపడ్డాయన్నారు. బోగస్ ఇళ్లపై పంచాయతీ రాజ్ శాఖ తనిఖీల్లో వెలుగు చూశాయన్నారు. పేదవాళ్ల కోసం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా డబుల్‌బెడ్‌రూమ్‌లు చేపట్టారని, దీని కోసం రాష్ట్రంలో 2.80 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉందన్నారు. ఇప్పటి వరకూ 40 వేల ఇళ్లు పూర్తి చేశామని, త్వరలో మరో 30వేల ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. త్వరలో లక్షా 50 వేల ఇళ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. డబుల్ బెడ్ రూమ్‌ల కోసం ప్రభుత్వం రూ. 7.800 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నమన్నారు. ఇప్పటి వరకూ కేంద్రం 1340 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణాలు వేగంగా జరుగుతన్నాయని, జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాలు ఆలస్యం జరుగుతోందని, దీనికి కారణాలు ఏమిటని జీవన్‌రెడ్డి మంత్రి ప్రశ్నించారు. అందకు మంత్రి సమాధానం చెబుతూ హైదరాబాద్‌లో ఇళ్ల నిర్మాణాలకు భూ సమస్య తలెత్తడం లేదని, అదే గ్రామీణా ప్రాంతల్లో ఇళ్ల నిర్మాణాలకు భూ సమస్య నెలకొందని, దీంతో జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాల్లో జాప్యానికి కారణంగా ఉందన్నారు. గ్రామీణా ప్రాంతల్లో ఇళ్ల నిర్మాణాలకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని, అదే హైదరాబాద్‌లో ఇళ్ల నిర్మాణాలకు కాంట్రాక్టర్లు పోటీపడుతున్నారని మంత్రి గుర్తు చేశారు. గ్రామ, పట్టణ, నగరాల్లో రెండుపడకల గదుల నిర్మాణాలకు కేంద్రం వాటా సకాలంలో చెల్లించకపోవడంతో ఇళ్లను పూర్తి చేయలేకపోతున్నామని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం వివిధ కారణాలను చూపుతోందన్నారు. కేంద్రం చూచించే నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షిస్తున్నారన్నారు. ఇళ్లపై తెరాస ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి మధ్య వాడివేడిగా చర్చ జరిగింది.