తెలంగాణ

అప్పులు లేని రాష్ట్రంగా తెలంగాణ మారుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు సమర్థవంతమైన పరిపాలన వల్ల తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో అప్పులులేని రాష్ట్రంగా మారుతుందని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై గురువారం శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొంటూ, టీఆర్‌ఎస్ నుండి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలంతా కేసీఆర్ ఫోటోతోనే గెలిచామన్నారు. ఈ విషయంలో తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. టీఆర్‌ఎస్‌కు కేసీఆర్ అధినాయకుడని, కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఎవరున్నారని ప్రశ్నించారు. సంక్షేమ ముఖ్యమంత్రిగా, రైతుపక్షపాత ముఖ్యమంత్రిగా, రైతు బాంధవుడిగా కేసీఆర్‌కు ప్రజల గుండెల్లో స్థానం లభించిందని అన్నారు. నీటిపారుదల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను రూపొందించడంలో ప్రముఖ ఇంజనీర్‌గా కూడా కేసీఆర్ అమోఘమైన మేధాశక్తి ఉపయోగపడుతోందన్నారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సంక్షేమానికి కొదవలేదని బాలరాజు పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రబాగాన నిలిపిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ అందరి ప్రశంసలు పొందుతున్నారన్నారు. 2020-21 సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు దేశానికి నమూనాగా మారిందని కొనియాడారు. గత ఆరేళ్లలో విద్య, వైద్యానికి లభించిన ప్రాధాన్యతతో ఈ రంగాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయన్నారు. రైతుబంధు, రైతుబీమా, పంటల రుణాల మాఫీ తదితర పథకాలతో వ్యవసాయ రంగం బలోపేతం అయిందని, రైతులంతా ఆనందంగా ఉన్నారన్నారు. తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెరుగుకావడంతో ఇతర రాష్ట్రాల నుండి కూలీలు ఇక్కడికి వలస వస్తున్నారని తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడే ప్రభుత్వం అప్పులు తెస్తోందని, ఈ అప్పులను నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, భవనాల నిర్మాణం తదితర ఆస్తుల పెంపకానికి మాత్రమే ఉపయోగిస్తున్నామన్నారు.