తెలంగాణ

అసెంబ్లీలో జీరో అవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: దొంగల సింగారం గ్రామం పేరును ప్రగతి సింగారంగా మార్చాలని ఎమ్మెల్యే ధర్మారెడ్డి రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. గురువారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ తమ గ్రామ ప్రజలు పేరును మార్చాలని కోరుతున్నారని, ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని అభ్యర్థించారు. మజ్లిస్ ఎమ్మెల్యే పాషా ఖాద్రి మాట్లాడుతూ జైన్ మతస్తుల మహవీర్ జయంతి జాతీయ సెలవుదినమని, కాని రాష్ట్రంలో ఐచ్ఛిక సెలవుదినంగా ఉందని, రాష్టస్థ్రాయిలో కూడా సెలవుగా ప్రకటించాలన్నారు. జైనులు మంచివారని, వ్యాపారస్తులని ఆయన అన్నారు. జైనులు కూడా మైనారిటీ మతస్తులని చెప్పారు. ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మాట్లాడుతూ హాలియాపట్టణంలో డిగ్రీకాలేజీని ఏర్పాటుచేయాలన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఒక వ్యక్తి మద్యం సేవించారా లేదా అని కొలిచే సాధనాన్ని పలువురికి అదే ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకరికి ఉపయోగించిన సాధనాన్ని మరొకరికి ఉపయోగించరాదని కోరారు. అంతవరకు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిలుపుదల చేయాలన్నారు. ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గట్టుప్పల్ పెద్ద గ్రామమని, మండల కేంద్రంగా ప్రకటించాలన్నారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ విద్యుత్ సబ్ స్టేషన్లలో ఆపరేటర్లను నియమించాలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ఏటూరినాగారం, మంగపేట మండలాలు గోదావరి వరదలకు ముంపుకు గురవుతున్నాయని, నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు జీరోఅవర్‌లో ప్రస్తావించిన అంశాలపై అధికారులు లిఖితపూర్వక సమాధానాలను వెంటనే పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఇప్పటికే ఆదేశించినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.