తెలంగాణ

ఎంత ఖర్చయినా వెనుకాడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా) వైరస్‌ను ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పేర్కొన్నారు. శనివారం నాడు శాసనసభలో ఆయన ఒక ప్రకటన చేస్తూ రోజురోజుకూ కోవిడ్ ప్రభావం ఎక్కువవుతోందని, ఈ క్రమంలో వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతున్నామని అన్నారు. కోవిడ్ వైరస్‌పై ఎవరూ భయాందోళనకు గురికావద్దని, రాష్ట్రంలో ఎవరికీ కోవిడ్ రాలేదని, పాజిటివ్ కేసులన్నీ బయటి ప్రాంతాల నుండి వచ్చినవారివేనని పేర్కొన్నారు. ప్రభుత్వం కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు వెయ్యి కోట్లు కాదు, అవసరమైతే ఐదువేల కోట్లు అయినా వెచ్చిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు కోవిడ్‌పై కట్టుదిట్టమైన చర్యలను చేపట్టామని, గత 10-12 రోజులుగా సమీక్షిస్తున్నామని అన్నారు. భారత్‌లో కరోనా 65 మందికి సోకిందని, అందులో 17 మంది విదేశీయులని, కరోనా వచ్చి తగ్గిన తర్వాత 10 మంది ఆస్పత్రుల నుండి డిశ్చార్జి అయ్యారని, గాంధీలో కూడా ఒకరు డిశ్చార్జి అయ్యారని చెప్పారు. మొత్తం దేశంలో ఇంతవరకూ చనిపోయింది ఇద్దరేనని ఆయన అన్నారు. ఈ వైరస్ ప్రపంచానికి కొత్త కాదని, ప్రతి వందేళ్లకోమారు ఇది బ్రేక్ అయి గడగడలాడిస్తోందని చెప్పారు. 1890లో స్పానిష్ ఫ్లూ పేరుతో ఇది వ్యాపించిందని, కనీసం 12 కోట్ల మంది చనిపోయారని, భారత్‌లో కూడా కోటి మంది వరకూ చనిపోయారని అన్నారు. ఆనాడు ఇది ముంబై డాక్‌యార్డు నుండి విస్తరించినట్టు గుర్తించారని, అంటే ఏదో విధంగా ఇంటర్నేషనల్ కనెక్టివిటీతో
ఇది ప్రబలుతోందని ఆయన అన్నారు. శుక్రవారం రాత్రి కూడా ఆరోగ్య శాఖ కార్యదర్శితో ఈ అంశంపై సమీక్షించినపుడు ఇటలీ నుండి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని చెప్పారని, మరో ఇద్దరు కూడా అనుమానితులు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వారి రిపోర్టులు పూనే పంపారని ఇంకా వాటి ఫలితం తేలాల్సి ఉందని సీఎం వివరించారు. వీరంతా బయటి దేశాల నుండి వచ్చిన వారేనని, అన్ని రకాలుగా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని చెప్పారు. బెంగళూరు నగరంలో పూర్తిగా అన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుండి పనిచేయాలని చెబుతున్నాయని, సినిమా హాళ్లు, మాల్స్‌ను మూసివేశారని, భారీ సంఖ్యలో ప్రజలు గుమికూడవద్దని చెబుతున్నారని, అదే పరిస్థితి భువనేశ్వర్‌లో కూడా ఉందని, హైదరాబాద్ కూడా మెట్రో నగరం కనుక ముందస్తు చర్యలు తీసుకోవల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. విదేశీ ప్రయాణికులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ వస్తున్నారని, అలా వస్తున్న వారిని పరీక్షించి ఎయిర్‌పోర్టులోనే వారిని సురక్షిత కేంద్రంలో ఉంచుతున్నామని, ఈ మొత్తం వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సివిల్ సర్వీసు అధికారులతో ఒక సమన్వయ కమిటీని కూడా నియమించామని చెప్పారు. దేశమంతా అప్రమత్తమైనపుడు వెర్రిబాగుల వాళ్లలా ఉండకూడదని, అది తప్పవుతుందని, అందుకే రాష్ట్రంలో కూడా హైలెవెల్ కమిటీలను వేశామని, తగిన చర్యలు తీసుకుంటున్నామని సీఎం అన్నారు. వ్యాధి ప్రబలితే తీసుకోవాల్సిన చర్యలు చేపట్టామని, మాస్క్‌ల కొరత రాకుండా చూస్తున్నామని, వైద్య బృందాలు సిద్ధమయ్యాయని, మందులు సిద్ధం చేశామని, ప్రత్యేక మాస్క్‌లు కూడా రెడీ చేస్తున్నామని తెలిపారు. ఇందుకు అవసరమైతే ఐదు వేల కోట్లు ఖర్చయినా వెనుకాడేది లేదని పేర్కొన్నారు. అన్నివిధాలా కోవిడ్ ఉత్పాతాన్ని ఎదుర్కొంటామని, గట్టి చర్యలే చేపడుతున్నామని అన్నారు. అనంతరం కోవిడ్‌పై జరిగిన చర్చలో కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ పారాసిట్‌మాల్ వేసుకుంటే చాలని సీఎం చెప్పారని, ఇపుడు ఎంతైనా ఖర్చు చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు. 30 డిగ్రీలు దాటితే కరోనా బతకదని అన్నారని, మానవ శరీరంలోనే 37 డిగ్రీలు ఉంటుందని చెప్పారు. నవంబర్ నుండి కోవిడ్‌పై వార్తలు వస్తున్నా పట్టించుకోకపోవడం వల్లనే ప్రపంచానికి ఈ మహమ్మారి ముప్పు తెచ్చిందని భట్టి వ్యాఖ్యానించారు.