తెలంగాణ

దేశానికి కాంగ్రెస్సే ‘కరోనా’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: కరోనా వైరస్‌పై కాంగ్రెస్ నేతలు దిక్కుమాలిన ప్రకటనలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులను చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ప్రకటనతో కాంగ్రెస్ నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సీఎం వర్సెస్ భట్టి మధ్య వాగ్వాదం నెలకొంది. కరోనా వైరస్‌పై సీఎం చాలా తేలికగా మాట్లాడుతున్నారని, కేవలం పారాసిట్‌మాల్ వేసుకుంటే పోతుందని చెప్పడం విడ్డూరంగా ఉందని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. పారాసిట్‌మాల్‌తో పోయే కరోనా వ్యాధికాదని సీఎం గుర్తించుకోవాలని భట్టి ఎదురుప్రశ్న వేశారు. భట్టి మాటలతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మస్తు విషయాలపై కాంగ్రెస్ నేతలు మాట్లాడకుండా నోరు ఉందని కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. కరోనా వైరస్ కాంగ్రెస్ పార్టీకి సోకిందని సీఎం చెప్పడంతో శాసనసభ నవ్వులమయమైంది. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని, శవాలపై పేలాలు ఏరుకునే స్థాయికి కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడడం బాగోలేదన్నారు. సీఎం ప్రసంగంపై కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అడ్డుపడ్డారు. సీఎంకు అహంభావం పెరిగిందని, దీనిని తగ్గించుకుంటే మంచిదని కాంగ్రెస్ నేతలు సూచించారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ నేతల ఆగమాగం చూస్తుంటే ప్రజలను ఆందోళనకు గురిచేసే విధంగా మాట్లాడడం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే దేశానికే ఉత్పాతం వచ్చినట్లుగా చెప్పడం సరికాదన్నారు. దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కరోనా వైరస్‌తో మృతి చెందితే అక్కడ ప్రభుత్వం విఫలం చెందిందని అనుకోవాలా అంటూ సీఎం ప్రశ్నించారు. విదేశాల నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికులపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని సీఎం సమాధానం చెప్పారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులను పరీక్షించడానికి దాదాపు 200 మంది వైద్య సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నారని సీఎం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. కరోనా వైరస్‌పై ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం అనవసరం అని అన్నారు. పరిస్థితులను కంపుచేయవద్దని సీఎం హితవు పలికారు. గ్రామీణ
ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటిస్తే ప్రజల ఆరోగ్యాలు కుదుట పడతాయన్నారు. కాంగ్రెస్‌కు కరోనా సోకిందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేతలు పట్టుపడ్డారు. కాంగ్రెస్‌కు 130 సంవత్సరాల చరిత్ర ఉందని, అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారా అంటూ కాంగ్రెస్ నేతలు నిలదీశారు.

*చిత్రాలు.. కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి కేసీఆర్