తెలంగాణ

ప్రజలపై ఏదో ఒక రూపంలో భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒకరూపంలో భారాన్ని పెంచుతున్నాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యుత్ చార్జీలను , ఆస్తిపన్ను పెంచుతామని చెప్పడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వేర్వేరు ప్రకటనల్లో నిరసన తెలిపారు. వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజల మీద భారాలను మోపడం దారుణమని, అన్ని ఎన్నికలూ ముగిశాక చార్జీలు, పన్నులు పెంచడాన్ని ప్రభుత్వ మోసపూరితతత్వాన్ని బయటపెడుతోందని చాడ వెంకటరెడ్డి చెప్పారు. తక్షణమే ముఖ్యమంత్రి తన ప్రకటనను ఉపసంహరించుకోవాలని, అడ్డగోలుగా చార్జీలు పెంచితే ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదని అన్నారు.
పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం రెండు నుండి 8 రూపాయిల వరకూ ఎక్సైజ్ సుంకాన్ని పెంచడాన్ని చాడ ఖండించారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పడిపోతుంటే పెట్రోలు ధరలు పెంచడం ఏ మాత్రం సమర్ధనీయం కాదని అన్నారు. ఆర్ధిక మందగమనం ఫలితంగా ప్రజల చేతుల్లో డబ్బులు లేని పరిస్థితుల్లో పెట్రోలు ధర పెంచడం సామాన్యుల నడివిరిచినట్టవుతుందని చాడ అన్నారు.
ఇప్పటికే భారాలతో కుంగిపోతున్న ప్రజలపై మరిన్ని భారాలు వేయడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించినట్టు తమ్మినేని వీరభద్రం చెప్పారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పేదలకు తక్కువ విద్యుత్ చార్జీలు నిర్ణయించారని, ప్రస్తుతం నష్టాల్లో ఉందని డిస్కామ్‌లు చెప్పడం ద్వారా పన్నులు పెంచుతామనంటున్నారని, డిస్కాంలు 14వేల కోట్లు ఏటా నష్టాల్లో కొనసాగడానికి వారి విద్యుత్ నిర్వహణ లోపాలే కారణమని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా నష్టాలు, అధిక ధరలకు మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లు భారీ నష్టాలే వస్తున్నాయని , సక్రమంగా లేని ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్ల వినియోగం వల్ల ఈ నష్టాలు పెరుగుతాయని చెప్పారు.