తెలంగాణ

నా ధర్నాకు అనుమతి నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: ఈ నెల 16వ తేదీన ఇందిరా పార్కు వద్ద సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు తలపెట్టిన అఖిల పక్షం ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కరోనా వైరస్ కోవిడ్ 19 విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, హైకోర్టు సూచనల మేరకు ధర్నాలు, జనాలు గుమిగూడే అవకాశం ఉండే సదస్సులకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు తెలిపినట్లు ఆయన చెప్పారు. ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత ధర్నా తేదీని ప్రకటిస్తామన్నారు. గతంలో తమ అంబేద్కర్ విగ్రహం పోలీసులు ఎత్తుకెళ్లారని, ఆ విగ్రహాన్ని ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా పంజాగుట్ట వద్ద ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.