తెలంగాణ

బడ్జెట్ పద్దులు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులపై మిశ్రమ స్పందన వచ్చింది. తెనాస సభ్యులు బడ్జెట్ పద్దులు భేష్ అంటూ ప్రసంగించగా, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు బడ్జెట్ నిధులు పంచిపెట్టే విధంగా ఉందన్నారు. రైతుబంధు పథకం ఉన్నోళ్ళకే పంచపెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో 70 శాతం రైతులు కౌలుకు భూములు చేస్తన్నారని, వారికి రైతుబంధు పథకం అందడం లేదన్నారు. రైతుబంధుకు ఇచ్చే నిధులు రైతుకు ఎరువులు, విత్తనాలతో పాటు పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే రైతు కుటుంబం చల్లగా ఉంటుందన్నారు. రైతు బంధు పథకంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పద్దులపై 9 అంశాలపై తాను మాట్లాడాలని అందుకు ఎక్కువ సమయం ఇవ్వాలని స్పీకర్‌కు ఆయన సూచించారు. అయితే ప్రతి సభ్యుడికి కనీసం 5 నిమిషాలు ఇస్తానని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. దీంతో రాజగోపాల్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెరాస సభ్యుడు అంజయ్ యాదవ్ మాట్లాడుతూ రెవెన్యూ చట్టాల్లో ఉన్న లొసుగులతో చిన్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ భూముల రిజిస్ట్రేషన్లు తప్పుల తడకగా ఉందన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్దులు అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ వాళ్లపల్లి గ్రామంలో పట్టాదారు పుస్తకాలు ఇప్పటికీ పంపిణీ జరగలేదన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ గతంలో ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులతో కేసులు నమోదుదో కల్లుగీత కార్మికులు భయాందోళన చెందేవారన్నారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితులు తెలంగాణలో లేవన్నారు. ఎల్లారెడ్డి ఏమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ రవాణాశాఖలో వినూత్న పథకాలు అమలు చేయడంతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందన్నారు. ఆర్టీసీని బలోపేతం చేయడానకి కేసీఆర్ చేస్తున్న కృషితో సంస్థ లాభాల బాటపట్టిందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ జంటనగరాల్లో వైన్‌షాపులు ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయన్నారు. గుడి, చర్చి, మజీద్ వంటి ప్రదేశాల వద్ద వైన్ షాపులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ బడ్జెట్ పద్దులకు కేటాయించిన నిధులు పరిశీలిస్తే బంగారు తెలంగాణ కోసం అడుగులు వేస్తోందని అన్నారు. భూపాల్‌రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ అవుతున్న సరుకులు పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.