తెలంగాణ

కరోనాపై అవగాహన పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్న కరోనా వైరస్ నివారణకు చేపట్టే చర్యల కంటే, కరోనా వైరస్ విస్తరించకుండా ప్రజల్ని అప్రమత్తం చేయాలని కాంగ్రెస్ పక్షనేత భట్టి విక్రమార్క ప్రభుత్వానికి సూచించారు. ఆదివారం శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ పద్దులపై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాపై ఉన్నతస్థాయి సమీక్షలు చేస్తూ ముందస్తు చర్యలను ప్రారంభించడం కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందన్నారు. ప్రజల సమస్యలపై చర్చించడానికి సమావేశాలను కుదించడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. పద్దులపై చర్చించడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో తాను మాట్లాడాల్సిన అంశాలను కోడ్ చేస్తూ సుదీర్ఘ లేఖను సీఎంకు పంపిస్తున్నానని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. లేఖ ప్రతులను స్పీకర్‌కు పంపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దుల్లో డొల్లతనం స్పష్టంగా కన్పిస్తోందన్నారు. బడ్జెట్ పద్దులను పరిశీలిస్తే చిత్తుకాగితాలకే పరిమితం అవుతాయని ఆయన ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో దాదాపు 35 అంశాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. విద్యా వైద్య రంగలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రెండు ప్రధాన అంశాలు విద్యా, వైద్య రంగాలపై పూర్తిస్థాయిలో చర్చించడానికి తనకు అవకాశం ఇవ్వనందుకు నిరసన వ్యక్తం చేశారు. విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు తక్కువ సంఖ్యలో ఉన్నందున ఒకే గదిలో ఇంగ్లీష్, తెలుగు పాఠాలను చెప్పడం ఔచిత్యం ఏమిటని ఆయన నిలదీశారు. ప్రభుత్వ నిర్వాహకంతో ఇటు ఇంగ్లీష్ అటు తెలుగులో అవగాహన లేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్‌పై గందరగోళం నెలకొందన్నారు. చదువులపై గొప్పలు చెప్పుకునే అధికార పార్టీ విద్యావ్యవస్థలను పటిష్టం చేయాల్సిన బాధ్యత మర్చిపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఉపాధ్యాయుల కొరత చదువుల కొరతగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు. హైదరాబాద్‌లో అనుమతిలేని కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా విస్తరిస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. నకలీ కార్పొరేట్ విద్యా సంస్థలను తక్షణం అదుపు చేయకపోతే విద్యార్థలు మోసపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబాలకు పిల్లలే ఆస్థులు, సంపద అటువంటి పిల్లల భవిష్యత్‌ను దెబ్బతీసే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్ధలు మనకు అవసరమా అంటూ ఆయన నిలదీశారు. వర్సిటీలకు వైస్‌చాన్స్‌లర్స్ లేక పోవడంతో ఉన్నత విద్య కుంటుబడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయంలో విద్యను ప్రధాన్యత రంగంగా గుర్తించడం జరిగిందన్నారు. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్ ఐటీలను తీసుకువచ్చిన ఘనత దక్కిందన్నారు. 10వ తరగతిలో అత్యధిక మార్క్‌లు వచ్చిన విద్యార్థులు ఎలాంటి సిఫార్స్ లేకుండా ట్రిపుల్ ఐటీల్లో సీట్లు దక్కిన అంశాలను ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థలకు ఫీజు రియంబర్స మెంట్ ఇస్తున్నందున ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థలు చేరడానికి వెనకడుగు వేస్తున్నారని, దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లో ప్రధాన ఆసుపత్రును మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాత కాలంనాటి ఆసుపత్రులను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తెరాస అధికారంలోకి వచ్చి ఆరు సంవత్సరాలు అయినప్పటికీ గ్రూప్ 1,2 పొస్టుల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ ప్రకటించకపోవడం దుర్మార్గం అన్నారు. తెలంగాణ యువత వయస్సు దాటిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తోందని ఆయన గుర్తు చేశారు. గ్రామీణా ప్రాంతాల్లో ఊళ్లకి మధ్య రహదార్లను అనివృద్ధి చేయడానకి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందన్నారు. గతంలో రహదార్ల పనులు ప్రారంభించినా వాటిని ఇంకా పూర్తి చేయడానకి నిధులు విడుదల చేయకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.