తెలంగాణ

కరోనాపై డేగ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: కరోనాను అరికట్టడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం 24న7 అప్రమత్తంగా ఉంది. కరోనా నివారణకు ముందస్తు చర్యల కోసం ఐఏఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల స్క్రీనింగ్ దగ్గర నుంచి అనంతగిరి, గచ్చిబౌలి, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో అందిస్తున్న చికిత్సల వరకు, రాష్ట్ర సరిహద్దులపై నిఘా నుంచి ల్యాబ్‌లకు పంపించిన పరీక్షల వరకు ఎప్పటికప్పుడు ఏమి జరుగుతుందో నిరంతరం మంత్రి ఈటల ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో కరోనా అనుమానితులకు అందిస్తున్న చికిత్సలు, ముందు జాగ్రత్తగా తీసుకుంటున్న, తాజాగా తీసుకున్న చర్యలపై శాసనసభ ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చాంబర్‌కెళ్లి మంత్రి వివరించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లకు అదనంగా గచ్చిబౌలి స్టేడియాన్ని కూడా క్వారంటైన్ సెంటర్‌గా ఏర్పాటు చేసినట్టు మంత్రి వివరించారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా అనుమానితులకు ఏర్పాటు చేసిన పడకలు నిండిపోతే గచ్చిబౌలి కేంద్రానికి పంపించడానికి ముందస్తుగా సిద్ధం చేసినట్టు మంత్రి తెలిపారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వైద్య సిబ్బందికి, రోగులకు అవసరమైన మాస్క్‌లు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ), ఎన్-95 మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లను వెంటనే కొనుగోలు చేయాల్సిందిగా వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారిని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. అత్యవసర కొనుగోళ్లకు టెండర్ల వల్ల జాప్యం జరిగే అవకాశం ఉండడంతో నేరుగా క్యాష్ అండ్ క్యారీ విధానంలో కొనుగోలు చేయడానికి మంత్రి అనుమతించారు. 2 లక్షల ట్రిఫుల్ లేయర్ మాస్క్‌లు, లక్ష గ్లౌజులు, 50 వేల ఎన్-95 మాస్క్‌లు, 25 వేల పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ), రాష్టవ్య్రాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య
కేంద్రాలకు సరిపడినన్ని శానిటైజర్లను కొనుగోలు చేయాల్సిందిగా మంత్రి ఆదేశించారు. గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు సాధారణ వ్యక్తులకు ప్రవేశం లేకుండా దారులన్నీ మూసివేయాల్సిందిగా ఆదేశించారు. కరోనా అనుమానితుల శాంపిల్స్‌ను నిర్ధారణ కోసం పూణె ల్యాబ్‌కు పంపించాల్సిన అవసరం లేకుండానే ఇక్కడే ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్టు మంత్రి ఈటల మీడియాకు తెలిపారు. పూణె నుంచి వచ్చే పరీక్షల కోసం ఇకనుంచి ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. ఇటలీ నుంచి వచ్చిన యువతికి చికిత్స తర్వాత కరోనా నెగెటివ్ రావడంతో మరో నాలుగైదు రోజుల తర్వాత ఇంటికి పంపించనున్నట్టు తెలిపారు. పాజిటివ్ వచ్చిన ఇద్దరు గాంధీలో చికిత్స అందిస్తున్నామని ల్యాబ్ రిపోర్ట్స్ చూశాక నిర్ణయం తీసుకుంటామన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానం నుంచి వచ్చే ప్రతీ ప్రయాణికునికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నామని, అనుమానం ఉంటే అనంతగిరిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తున్నామని చెప్పారు. ఇలాఉండగా ఐసోలేషన్ సెంటర్లలో పనిచేసే వైద్యులు, సిబ్బందిని మూడు షిఫ్టుల్లో నియమించాలని, చికిత్స పొందుతున్న అనుమానితులకు మంచి భోజనం అందించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. శాసనసభలో తన చాంబర్ నుంచి మంత్రి ఈటల వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కమిషనర్ టీకే శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్‌రెడ్డి, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్‌రావు, టీఎస్‌ఎండీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

*చిత్రం... కరోనా నివారణకు ముందస్తు చర్యల కోసం ఐఏఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్