తెలంగాణ

పంట రుణ మాఫీపై మార్గదర్శకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు 2018 సాధారణ ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన పంటల రుణ మాఫీ హామీ ఇప్పుడు అమల్లోకి వస్తోంది. శాసనసభలో ఇటీవల ప్రతిపాదించిన వార్షిక బడ్జెట్‌లో రుణ మాఫీకి మొదటి దశ నిధులు కేటాయించారు. కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పంట రుణ మాఫీపై మంగళవారం మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి పేరుతో జారీ చేశారు. జారీ అయిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల (లెం డింగ్ ఇనిస్టిట్యూట్స్) నుండి రైతులు తీసుకున్న పంటల రుణాలు, స్వల్పకాలిక రుణాలకు రుణ మాఫీ వర్తిస్తుంది.
లెండింగ్ ఇనిస్టిట్యూట్స్ నుండి ఒక కుటుంబం తీసుకున్న రుణాల్లో రూ.లక్ష వరకు మాఫీ అవుతుంది. కు టుంబం అంటే కుటుంబ పెద్ద, అతడి భార్య, వారిపై ఆధారపడ్డ పిల్లలు. రుణమాఫీ జరిగే మొత్తంలో ప్రాసెసింగ్ చార్జీలు, లీగల్ చార్జీలు, ఇన్సూరెన్స్, ఇన్‌స్పెక్షన్ చార్జీలు ఉంటాయి.
2014 ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత మంజూరైన లేదా రెన్యువల్ అయిన రుణాలకు మాఫీ వర్తిస్తుంది. 2018 డిసెంబర్ 11 వరకు తీసుకున్న రుణాలకే మాఫీ వరిస్తుంది.
వ్యవసాయ పంటలను తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదు. టైఅప్ లోన్లకు వర్తించదు. పంట రుణాల ఖాతాలు
మూసివేసిన వాటికి, రద్దయిన రుణాలకు వర్తించదు. జేఎల్‌జీ, ఆర్‌ఎంజీ, ఎల్‌ఈసీల రుణాలకు వర్తించదు. రీస్ట్రక్చర్/రీషెడ్యూల్ అయిన రుణాలకు కూడా మాఫీ వర్తించదు.
* స్వల్పకాలిక పంట రుణాలు అంటే 18 నెలల్లో తిరిగి చెల్లించేందుకు వీలుగా పంటలను వేసేందుకు ఇచ్చే రుణాలకు మాఫీ వర్తిస్తుంది. పెట్టుబడి, సాంప్రదాయ, సాంప్రదాయేతర మొక్కల పెంపకం, ఉద్యాన పంటలకు కూడా వరిస్తుంది.
* రుణమాఫీ అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ ఐటీ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తుంది. నిర్ణీత గడువు మధ్య రుణాలు తీసుకున్న రైతుల పేర్లను గ్రామాల వారీగా గుర్తిస్తారు. బ్యాంకులు రైతుల పేర్లతో జాబితాలను తయారు చేస్తాయి.
* పట్టణాల్లో ఉండే పట్టణ, మెట్రోపాలిటన్ బ్యాంకుల నుండి పంట రుణాల కోసం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదు. అయితే పట్టణ, మెట్రోపాలిటన్ బ్యాంకులకు చెందిన గ్రామాల్లోని బ్రాంచీలు ఇచ్చిన రుణాలు మాఫీ అవుతాయి.
* మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో బ్యాంకర్ల కమిటీలు సమావేశమై చర్చించి లబ్ధిదారులను నిర్ణయిస్తాయి.
* ప్యాక్స్‌లోని లబ్ధిదారుల వివరాలపై సహకార శాఖ ఆడిటర్లు పరిశీలన చేసి రైతుల పేర్లతో జాబితాలకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
* మండల, జిల్లా, రాష్టస్థ్రాయిలో గ్రీవెన్స్ మానిటరింగ్ విభాగాలను ఏర్పాటు చేస్తారు.
* 25 వేల రూపాయల వరకు ఉన్న రుణాలు మొదటి దశలోనే మాఫీ అవుతాయి. 25 వేల నుండి లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలకు సంబంధించి నాలుగు దశల్లో మాఫీ అవుతుంది.
* బ్యాంకర్లు నిర్ణీత ప్రొఫార్మాలో రైతుల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.