తెలంగాణ

నిజామాబాద్ ఎమ్మెల్సీగా కవిత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: నిజామాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపి కల్వకుంట్ల కవితను ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.
అయితే, అధికారికంగా ఇంకా ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. గురువారం నామినేషన్ల దాఖలుకు గడువు చివరి తేదీ కావడంతో టీఆర్‌ఎస్ అధిష్టానం అభ్యర్థిని బుధవారం ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. ఎమ్మెల్సీకి కవిత బుధవారం నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్టు ఈ వర్గాల సమాచారం. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఓటమి పొందిన కవిత, ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని ఆశించిన విషయం తెలిసిందే. అయితే పార్టీ పార్లమెంట్ నాయకుడు కేశవరావుకు మరోసారి అవకాశం ఇవ్వడంతో పాటు మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిని రెండో స్థానానికి ఎంపిక చేసింది. దీంతో కవితకు రాజ్యసభ సీటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలో ఒకటి నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి కాగా మరొటి గవర్నర్ కోటా. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఇంకా నోటిఫికేషన్ జారీ కాలేదు. నిజామాబాద్ ఎమ్మెల్సీకి ఈ నెల 19 వరకు నామినేషన్ వేయడానికి గడువు ఉండగా మాజీ ఎంపి కవిత బుధవారం నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్టు టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం.

*చిత్రం...*మాజీ ఎంపీ కవిత