తెలంగాణ

పులులు ఎందుకు అంతరించిపోతున్నాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: భారత స్వాతంత్య్రం సిద్ధించడానికి ముందు వరకూ అనేక శతాబ్దాలుగా లెక్కలేనన్ని చిరుత పులులను పోగొట్టుకుంది. ప్రస్తుతం ఆఫ్రికాలో అత్యధిక సంఖ్యలో ఈ చిరుతలున్నాయి. వీటిని ఆఫ్రికన్ చిరుతలు అని పిలుస్తున్నారు. మరో పక్క ఆసియా చిరుతలుగా ఇరాన్‌లో 50 వరకూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో చిరుతలను దేశంలో పున: ప్రవేశం చేయించాలనే చర్చ బాగా జరిగింది. ఇంతకు పూర్వం భారతదేశంలో ఆసియా చిరుతలు ఉండేవి. కాలక్రమేణా వీటి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా క్షీణిస్తూ వస్తోందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఈ కారణంగానే ఆఫ్రికా చిరుతలు ఇక్కడి వాతావరణ పరిస్థితులకు న్యాయస్థానం ఆఫ్రికా చిరుతలను అనువైన ప్రదేశాల్లో ప్రవేశింపచేయడాన్ని కేంద్ర ప్రభుత్వానికి అనుమతిచ్చింది. భారతదేవంలో అడవుల్లో చిరుతలను ప్రవేశపెట్టాలంటే ఆసియా, ఆఫ్రికా చిరుతల్లో ఉండే బేధాలను గుర్తించాలని శాస్తవ్రేత్తలు నిర్ణయించారు. సిఎస్‌ఐఆర్ - సీసీఎంబీ శాస్తవ్రేత్తలు లక్నోలోని బీర్బల్ సహాని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియో సైనె్సస్ , కొల్‌కటాలోని జంతు సర్వే సంస్థ , యుకే కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, దక్షిణాఫ్రికాలోని జాన్సన్ బర్గ్ యూనివర్శిటీ నిపుణలు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి, ఆసియా , ఆఫ్రికా, చిరుతల పరిణామ క్రమం తెలుసుకునేందుకు సంయుక్త పరిశోధనలు చేశారు. సింగపూర్‌లోని నాన్యాన్ విశ్వవిద్యాలయంలోని మైటో కాండ్రియా డీఎన్‌ఏను విశే్లషించి, ఆసియా, ఆఫ్రికా చిరుతల ఉపకుటుంబాల ఎనినోనిక్స్ జుబాటస్ పరిణామ చరిత్రను గుర్తించారు. ఈ పరిణామ క్రమంలో రెండు జాతులూ చాలా భిన్నమైవని గుర్తించారు. పరిశోధన ఫలితాలను సైంటిఫిక్ రిపోర్ట్సు అనే పరిశోధన పత్రికలో ప్రచురించారు.
ఈ మొత్తం పరిశోధనలను సీసీఎంబీ ముఖ్య శాస్తవ్రేత్త డాక్టర్ తంగరాజ్ విశే్లషించారు. ముఖ్యంగా మూడు చిరుతపుల డీఎన్‌ఏను విశే్లషించామని ఆయన చెప్పారు. అవి 19వ శతాబ్దంలో మధ్యప్రదేశ్‌లో చంపిన చిరుత చర్మం నుండి సేకరించిందని, దానిని కోల్‌కటాలోని జంతు శాస్త్ర సర్వే విభాగం నుండి సేకరించిందని, రెండోది మైసూరులోని నేచురల్ హిస్టరీ మ్యూజియం నుండి చిరుత ఎముక నుండి 1850-1900 సంవత్సరంలో భద్రపరిచిందని అన్నారు. మూడో నమూనా హైదరాబాద్‌లోని జంతు ప్రదర్శన శాలలోని చిరుత నుండి సేకరించిన రక్త నమూనానుండి తయారుచేసిన డీఎన్‌ఏ అని వివరించారు. ఈ మూడు నమూనాల నుండి చారిత్రాత్మక నమూనాలు ఎముక చర్మం నుండి సీసీఎంబీలోని పురాతన కాలం నాటి డిఎన్‌ఏ మైటో కాండ్రియా నుండి డీఎన్‌ఏ వేరు చేసి వీటితో పాటు ఆధునిక చిరుత డీఎన్‌ఏను కూడా విశే్లషించినట్టు చెప్పారు. ఇంకా ఆఫ్రికా నైరుతి ప్రాంతాల్లో, ఆసియాలోని వివిధ ప్రాంతాల నుండి 118 చిరుతల మైటోకాండ్రియా డీఎన్‌ఏను విశే్లషించామని, ఈ పరిశోధనల్లో ముఖ్యులైన డాక్టర్ నీరజరాయ్ తెలిపారు. కోల్‌కటా జులాజికల్ సర్వే నుండి సేకరించిన నమూనాను, హైదరాబాద్ జంతు ప్రదర్శన శాల నుండి విశే్లషించిన నమూనాలు, ఆఫ్రికా ఈశాన్య ప్రాంతాల్లోని మాతృకల నుండి వచ్చి ఉండొచ్చని, మైసూరు నుండి సేకరించిన నమూనా ఆఫ్రికా, ఆగ్నేయ ప్రాంతాల్లో చిరుతలతో దగ్గరి సంబంధం ఉందని నిర్ణయించినట్టు డాక్టర్ తంగరాజ్ చెప్పారు. విస్తృతమైన విశే్లషణ తదనంతరం ఈశాన్య ఆఫ్రికా ప్రాంతాల్లోని చిరుతలు, ఆగ్నేయ ఆఫ్రికా చిరుతలు రమారమి వంద నుండి రెండు లక్షల సంవత్సరాల క్రితమే వేరుపడ్డాయని నిర్ణయించారు. ఈ విశే్లషణ ఆగ్నేయ ఆఫ్రికాతో పాటు ఆసియా చిరుతలు 50 నుండి లక్షల సంవత్సరాల మధ్య వేరు పడ్డాయని అనుకుంటున్నారు. ఈ ఫలితాలు ఇంత వరకూ భావిస్తున్నట్టు ఆసియా ఆఫ్రికా చిరుతలు ఐదు వేల సంవత్సరాల క్రితం పరిణామ విభజన చెందాయనే సిద్ధాంతానికి భిన్నంగా ఉందని కేంబ్రిడ్జి వర్శిటీకి చెందిన డాక్టర్ జాకబ్స్ తెలిపారు. పరిశోధనా ఫలితాలు ఆసియా చిరుత పులుల ప్రత్యేక జన్యు నిర్మాణాన్ని ధుృవీకరిస్తున్నాయని, నిర్దేశించిన జంతు పరిరక్షణ ప్రయత్నాలు కొనసాగించాలని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా పేర్కొన్నారు.