తెలంగాణ

పార్టీ వాణి వినిపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా కే కేశవరావు, కేఆర్ సురేష్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి శశాంక్ గోయల్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఎన్నికైన వీరిద్దరూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసనసభ కార్యదర్శి వేదాంతం నరసింహాచార్యులు నుంచి విజయపత్రాలను అందుకున్నారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు రెండు స్థానాలు ఖాళీ కాగా టీఆర్‌ఎస్ తరఫున పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఎంపీ కే కేశవరావుకు తిరిగి అవకాశం కల్పించగా, రెండో స్థానానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ల గడువు ముగిసేసరికి దాఖలైన రెండు నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు కావడంతో కేశవరావు, సురేష్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ అభ్యర్థులు గెలవడానికి టీఆర్‌ఎస్ పార్టీకి పూర్తి బలం ఉండడంతో ప్రతిపక్ష పార్టీలేవీ తమ అభ్యర్థులను బరిలోకి దింపలేదు. కేశవరావు, కేఆర్ సురేష్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి విజయపత్రాలు అందుకున్న కార్యక్రమానికి మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష కార్యాలయం ఎదుట పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై అభినందనలు
తెలియజేశారు.
సీఎం కేసీఆర్ ఆశయం నెరవేరుస్తా: కేకే
రాజ్యసభలో రాష్ట్ర ప్రజల గళాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను వినిపిస్తానని రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కేశవరావు అన్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆశయాలను నెరవేస్తానని అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో కేకే, కేఆర్ సురేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజ్యసభకు తనకు మళ్లీ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. కేఆర్ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. రాజ్యసభ సభ్యునిగా రాష్ట్ర ప్రజలు గర్వపడే విధంగా నడుచుకుంటానని అన్నారు. రాజ్యసభలో టీఆర్‌ఎస్ పార్టీ గళాన్ని వినిపిస్తానని అన్నారు. తనకు రాజ్యసభకు అవకాశం కల్పించడం పట్ల సీఎం కేసీఆర్‌కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. రాజ్యసభకు ఎన్నిక కావడం జీవితంలో తనకో పెద్ద చాలెంజ్‌గా భావిస్తున్నాని సురేష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

*చిత్రం... రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కే కేశవరావు, కేఆర్ సురేష్‌రెడ్డిలకు విజయపత్రాలు అందజేస్తున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి