తెలంగాణ

దేశాన్ని విచ్ఛిన్నపరుస్తున్న మతతత్వ శక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: దేశాన్ని విచ్ఛిన్నపరుస్తున్న మతతత్వ శక్తులు ఏకం కావాలని ఆనాడే ఉత్తమ పార్లమెంటేరియన్ ఇంద్రజిత్‌గుప్త వ్యాఖ్యానించారని, అదే బాటలో అంతా పయనించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.
ఇంద్రజిత్ గుప్తా 101వ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మతతత్వ పరిస్థితులను ఎదుర్కొనేందుకు లౌకిక వాదులు ఏకం కావాలని ఇంద్రజిత్ గుప్త పిలుపునిచ్చారని, అలాగే చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల కోసం వేతన సవరణ కోసం కార్మిక వర్గ చట్టాల రూపకల్పన చేయడంలోనూ , పౌర హక్కులను కాపాడాలని పలు సమస్యల మీద రాజీలేని పోరాటం చేసిన యోధుడు ఇంద్రజిత్ అని చెప్పారు. కాగా చాడ వెంకటరెడ్డి వేరొక ప్రకటన విడుదల చేస్తూ గ్రామీణ ఉపాధి పథకం కింద పనిచేస్తున్న క్షేత్రసహాయకులను సస్పెండ్ చేయడం అన్యాయమని చెప్పారు.
ప్రమాదకర పరిణామం
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను రిటైరైన నాలుగు నెలలకే రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయడం న్యాయవ్యవస్థలో ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆ పదవిని అంగీకరించడం అంటే ఒక విధంగా న్యాయవ్యవస్థకు కళంకమని, రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో వివిధ కేసుల్లో ఆయన ఇచ్చిన తీర్పులపై ప్రజల్లో అనుమానాలు ఏర్పడతాయని అన్నారు. వీరి కాలంలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మధ్య బహిరంగంగా విబేధాలు ఏర్పడ్తాడయని, అయోధ్య, రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు కేసుల్లో వెలువరించిన తీర్పులు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి అనుకూలం ఉన్నాయని, అంతే గాక లైంగిక ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారని అన్నారు. గతంలో వారిచ్చిన తీర్పులకు ప్రతిఫలంగానే ఈ నామినేటెడ్ పదవిని పొందారనడంలో ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు.