తెలంగాణ

రైతుల రుణమాఫీకి రూ.1,210 కోట్లు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన రుణ విమోచన పథకం అమలుకోసం తొలిదశలో 1210 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి బి. జనార్దన్‌రావు పేరుతో జీఓ (ఆర్‌టీ నెంబర్ 149) జారీ అయింది. 2019-20 సంవత్సరంలో రుణమాఫీ కోసం బడ్జెట్‌లో 6,000 కోట్ల రూపాయలను కేటాయించగా, తొలిదశలో 1210 కోట్లను బుధవారం విడుదల చేశారు. మరో 4,790 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్ నుండి విడుదల చేయాల్సి ఉంటుంది. రుణమాఫీ కి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.