తెలంగాణ

పంట రుణాలను ఏకమొత్తంలో మాఫీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: తెలంగాణ రాష్ట్రంలో పంట రుణాలను ఏకమొత్తంలో ఒకేసారి మాఫీ చేయాలని సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. నాలుగు వాయిదాల్లో రుణాలను మాఫీ చేయడం తగదన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ పంట రుణాల మాఫీపై ఇచ్చిన మార్గదర్శకాలు సమగ్రంగా లేవన్నారు. గతంలో చేసిన తప్పులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతులకు ఎటువంటి మేలు చేయలేదన్నారు. నాలుగు సంవత్సరాల పాటు రైతులు అనేక కష్టాలు పడ్డారని, వేధింపులకు గురయ్యారన్నారు. ప్రస్తుతం రైతులకు బ్యాంకుల్లో రూ.25వేల కోట్ల రుణాలు ఉన్నాయన్నారు. దీనిని బట్టిచూస్తే గతంలో ప్రభుత్వం అమలు చేసిన పంట రుణాల మాఫీ స్కీం విఫలమైందని చెప్పవచ్చునన్నారు.
తెలంగాణలో రైతుల రుణమాఫీపై జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ అధ్యయనం చేస్తే ఆసక్తికరమైన అంశాలు బహిర్గతమయ్యాయన్నారు. 80 శాతం మంది చిన్న రైతులు, 67 శాతం మంది సన్నకారు రైతులు ఏక మొత్తంలో ఒకేసారి రుణాలను మాఫీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైందని ఈ సర్వేలో ఆ సంస్థ పేర్కొన్నదన్నారు. ఒకేసారి రుణాల మాఫీపై విధి విధానాలను ఖరారు చేయాలన్నారు. రైతులు కోర్టుల్లో పెట్టిన బంగారాన్ని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 5,833,916 మంది రైతులకు మొత్తం రూ.25వేల కంటే రుణాలు ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారన్నారు. వీటిని మాఫీ చేసేందుకు రూ.1198 కోట్ల నిధులు అవసరమని చెప్పారు. పంట రుణాల మాఫీపై స్పష్టమైన డెడ్ లైన్ పెట్టాలన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఒక లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. బడ్జెట్‌లో కూడా నిధుల కేటాయింపు పెంచాలని కోరారు.