తెలంగాణ

సచివాలయ ఉద్యోగులకు థర్మల్ స్క్రీనింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: రాష్ట్ర సచివాలయంలో కరోనా సోకకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలంగాణ సెక్రటేరియేట్ అసోసియేషన్ (టీఎస్‌ఏ) ప్రభుత్వాన్ని కోరింది. టీఎస్‌ఏ అధ్యక్షుడు మాధవరం నరేందర్‌రావు, జనరల్ సెక్రటరీ షేక్ యూసుఫ్ మియా తదితరులు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌కు బుధవారం లేఖ అందించారు. సచివాలయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై తమ అభిప్రాయాలను వివరించారు. సచివాలయంలోకి వెళ్లే ప్రతి ఎంట్రీలో ఉద్యోగులను స్క్రీనింగ్ చేసి పంపించాలని, విజిటర్లను బీఆర్‌కే భవన్‌లోకి రానివ్వవద్దని, సచివాలయం ఉద్యోగులకు మాస్క్‌లను ఇవ్వాలని, సానిటైజర్లను సరఫరా చేయాలని కోరారు. ఎవరికైనా కరోనా వచ్చినట్టు అనుమానం వస్తే 15 రోజుల పాటు ప్రత్యేక సెలవులు ఇవ్వాలని నరేందర్‌రావు, యూసుఫ్ మియా కోరారు.