తెలంగాణ

అక్రమ కేసులతో రేవంత్‌ను వేధిస్తున్న సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై కేసీఆర్ సర్కార్ అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని, ఈ విషయమై త్వరలో సీనియర్లతో చర్చించి కార్యాచరణను ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి, న్యాయ వ్యవస్థను తప్పుదోవబట్టిస్తున్నారన్నారు.
రేవంత్ రెడ్డిపై పెట్టిన కేసులకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. ఈ వివరాలను త్వరలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి తెలియచేస్తామన్నారు. లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మళ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకి పంపి విచారణ జరిపించాలని కోరనున్నట్లు చెప్పరు. రేవంత్ రెడ్డి అరెస్టు, 111 జీవోలోని అంశాలు, కేటీఆర్‌పై వచ్చిన అభియోగాలపై పార్లమెంటు సమావేశాలు పూర్తయిన తర్వాత పార్టీ సదస్సులో విస్తృతంగా చర్చిస్తామన్నారు. తమ సహచరుడిని అక్రమంగా నిర్బంధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చిన్న చిన్న కారణాలు చూపుతూ నిర్బంధాన్ని పొడిగించే చర్యలు మంచిది కాదన్నారు. రేవంత్ రెడ్డి సభా హక్కులను రాష్ట్రప్రభుత్వం ఉల్లంఘిస్తున్నట్లు చెప్పారు. ఒక ఎంపీగా రేవంత్‌కు ఉండే సభా హక్కులను కల్పిచాలని, దీనిపై విచారణ జరిపించాలని లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.