తెలంగాణ

విదేశీ విమానాలు రద్దు.. ప్రయాణికులపై నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులతో కరోనా వైరస్ వ్యాపించకుండా నివారించడానికి తెలంగాణ ప్రభుత్వ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నదని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధానంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా ఉంచినట్లు ఆయన తెలిపారు. విదేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులను పూర్తిగా పరీక్షిస్తారని ఆయన తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ప్రయాణికులను నేరుగా కరోనా నియంత్రించడానికి ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లకు తరలిస్తామన్నారు. ఆయా క్వారంటైన్‌లలో దాదాపు 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో వారిని ఉంచుతామన్నారు. కేంద్రం ప్రజారోగ్య శాఖ ఆదేశాలను పాటించడానికి ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకోంటోందని చెప్పారు. యూరోపియన్, టర్కీ, అమెరికా, యూఏఈ, కతర్, ఒమన్, కువైట్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై అప్రమత్తం చేశామన్నారు. ఈనెల 18 నుంచి ఆయా దేశాల నుంచి విమానాలను తాత్కాలికంగా రద్దు అయ్యాయని చెప్పారు.
ఈనెల 31 వరకూ విదేశాల విమానాలను నిషేధించినట్లు కమిషనర్ తెలిపారు. కేంద్రం ఆదేశాలను ప్రయాణికులు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. కరోనా వైరస్‌వై కేంద్ర సూచనలను రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో అమలు జరుగుతాయన్నారు. ప్రభుత్వ ఆదేశాలను శంషాబాద్ విమానాశ్రయ అధికారులకు అందజేశామన్నారు.
ఎయిర్‌పోర్టులో మూడు ద్వారాల్లో ప్రయాణికుల రాకపై నిఘా పెట్టామన్నారు. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్‌లో హెచ్చరికలను తెలియజేయడానికి నోటీసులు అంటించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రకటించారు.