తెలంగాణ

విదేశాల నుంచి వచ్చే విమానాలను రద్దు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: విదేశాల నుండి వచ్చే అంతర్జాతీయ విమానాలను రద్దు చేయాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో సచివాలయంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌తో పాటు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. విదేశాలనుండి వచ్చిన వారికి మాత్రమే కరోనా ఉన్నట్టు ఇప్పటి వరకు నిర్దారణ అయిందని, కరోనాను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని మంత్రి తెలిపారు. విదేశాల నుండి కరోనా భారత్‌లోకి రాకుండా ఉండేందుకు మన దేశంలోకి వచ్చే అంతర్జాతీయ విమానాలన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం పాజిటివ్‌గా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామన్నారు. విదేశాల నుండి వస్తున్న వారిలో అనుమానితులను క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తున్నామని ఈ కేంద్రాల్లో వౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. అయితే ఈ కేంద్రాల్లో ఉండేవారు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులకు అడ్జస్ట్ కావాలని, ఆర్భాటమైన వౌలిక వసతులు కావాలని కోరవద్దని సూచించారు. ఎంత మంది వచ్చినా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి వివరించారు. మన రాష్ట్ర ప్రజలకు కరోనా వ్యాప్తి చెందకుండా సెకలండ్ లెవెల్ ట్రాన్సిషన్‌నుపై అప్రమత్తంగా ఉన్నామన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకారం అందించాలని మంత్రి కోరారు.

*చిత్రం...రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్