తెలంగాణ

కరీంనగర్ గడగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: ఇండోనేషియా నుంచి వచ్చి కరీంనగర్‌లో సంచరించిన 13 మందిలో 8 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు తేలడంతో కరీంనగర్ జిల్లా భయంతో గజగజలాడుతోంది. ఈ నెల 14, 15న వారు రెండు రోజులు కలెక్టరేట్
సమీపంలో సంచరిస్తూ ప్రార్థన మందిరాలకు వెళ్ళినట్టు సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు వెల్లడించారు. ఇండోనేషియా వాసులు సంచరించిన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొని గురువారం వంద ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటికీ వెళ్ళి నిర్బంధ వైద్య పరీక్షలు చేస్తున్నారు. నిత్యం ఇసుకేస్తే రాలని జనాలతో కిటకిటలాడే నగరంలోని పలు వీధులు ఒక్కసారిగా బోసిపోయాయి. వేకువజామునుంచి అర్ధరాత్రి వరకు సందడిగా ఉండే వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. వివిధ ఉద్యోగ, ఉపాధి పనుల్లో బిజీగా ఉంటూ క్షణం కూడా సమయం వృథా చేయని నగరవాసులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మానవ మహమ్మారిగా మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ప్రభావం తమపై పడుతుందనే భయాందోళనలతో నగరవాసులు ఒక్కసారిగా ముడుచుకుపోవటంతో గురువారం నగరంలో నెలకొన్న పరిస్థితి ఇది. తెలంగాణకు గుండెకాయ అయిన కరీంనగర్‌లో ఒకేసారి 8 మందికి కోవిడ్-19 సోకినట్టు అధికార యంత్రాంగం పేర్కొనటంతో నగరం నిలువునా వణికిపోతోంది. ఈ వార్త ఒక్కసారిగా ప్రచార మాధ్యమాల ద్వారా బహిర్గతం కావటంతో గురువారం ఉదయం నుంచే నగరానికి రాకపోకలు అంతంత మాత్రంగానే కొనసాగుతుండగా, వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు విధులకు గైర్హాజరై ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే దారులన్నీ వెలవెలబోతుండగా నగరంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. అత్యవసర పనులు ఉన్నవారు మినహా మిగతా ఎవరూ కూడా ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీనంతటికీ కారణమైన కరోనా వైరస్ కట్టడికి అధికార యంత్రాంగం ముమ్మర చర్యలు చేపట్టి నగరవ్యాప్తంగా కొనసాగిస్తోంది. అత్యంత ఊష్ణ ప్రభావిత ప్రాంతంగా పేరుగాంచిన కరీంనగరంలో ఇండోనేషియా నుంచి మత ప్రచారానికై వచ్చిన 13 మంది విదేశీయుల్లో 8 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారించగా, ఐదు రోజుల క్రితం వచ్చిన వీరంతా నగరంలో అనేక చోట్ల పర్యటించటంతో అప్రమత్తమైన అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. వీరు బసచేసిన మసీదు కలెక్టరేటుకు సమీపంలోనే ఉండగా ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్ల మేర నగరంలో ఆంక్షలు విధించారు. కలెక్టరేట్ పరిసరాల్లోని వాణిజ్య సముదాయాలు మూసి వేయించి వీరు బసచేసిన మసీదు పరిసరాల్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది వ్యాధి నివారణ మందులు చల్లారు. అలాగే జిల్లా కేంద్రంలో ప్రధాన వాణిజ్య సముదాయాలైన గంజ్, టవర్ సర్కిల్, కూరగాయల మార్కెట్, డాక్టర్స్ స్ట్రీట్, కమాన్ తదితర ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. దీని ప్రభావం జిల్లా వ్యాప్తంగా పడే అవకాశాలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వంద ప్రత్యేక వైద్య బృందాలతో ఇండోనేషియా బృందం తిరిగిన మసీదులు, ఆయా ప్రాంతాల పరిసరాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. వీరు ఎంత మందిని వ్యక్తిగతంగా కలిసారు. ఎక్కడెక్కడ తిరిగారు? ఏఏ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించారు? అనే వివరాలు సేకరించటంలో అధికారులు, రాజకీయ నాయకులు నిమగ్నమయ్యారు. వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు ఇప్పటికే నగరవ్యాప్తంగా బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం తెల్లవారుజాము వరకు పుటింగ్ స్ప్రే చేసినట్లు బల్దియా అధికారులు పేర్కొంటున్నారు. నగరంపై కరోనా ముసుగు తొడిగిన నేపథ్యంలో అప్రమత్తమైన వైద్యాధికారులు వందకు పైగా వైద్య బృందాలను రంగంలోకి దించారు. నగరంలోని ప్రతి ఇంటికి వైద్య బృందం వెళ్లి నిర్బంధ వైద్య పరీక్షలు చేస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపించిన వారిని ఎప్పటికప్పుడు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించి మరిన్ని వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. ఇప్పటివరకు వందకు పైగా అనుమానితులను తరలించినట్టు తెలుస్తోంది. అలాగే నగరంలో 20 ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, సివిల్ ఆసుపత్రిలో 10 ఐసీయు బెడ్‌లు సిద్ధం చేశారు. నగర శివారులలో గల రెండు ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో కూడా 50 పడకలు ఏర్పాటు చేసినట్టు ఆయా ఆసుపత్రుల నిర్వాహకులు తెలిపారు. అలాగే శాతవాహన విశ్వవిద్యాలయం ఆవరణలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి జిల్లాకు వస్తున్న వారిని అక్కడికి తరలించి 14 రోజుల పాటు పరిశీలనలో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. గంట గంటకు నగరవాసుల్లో భయం పెరిగిపోతున్న నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిఘా వర్గాల సూచన మేరకు పలు కూడళ్లలో, ప్రార్థనలయాల ఎదుట పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీస్ బృందాలతో నగరంలో గస్తీ నిర్వహిస్తున్నారు. ఒకేసారి 8 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో బహిర్గతం కాగా, నగరంలో నెలకొన్న పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రత్యామ్నాయ చర్యలు సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రాత్రి కరీంనగర్‌కు చేరుకోనున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో, స్థానిక నాయకులతో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
*చిత్రం...కరీంనగర్‌లో..మూతపడిన దుకాణా సముదాయం