తెలంగాణ

పంచాంగ శ్రవణానికి కరోనా గ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శ్రీ శార్వరి తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ వేడుకలతో పాటు శ్రీరామ నవమి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ప్రగతి భవన్ ఒక చోట నుంచే పంచాంగ శ్రవణం నిర్వహించి లైవ్‌లో ప్రసారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రగతి భవన్‌లో నిర్వహించే పంచాంగ శ్రవణానికి అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించి పరిమిత సంఖ్యతో నిర్వహించనున్నారు. ప్రతి ఏటా ఉగాది వేడుకలను ప్రగతి భవన్, రాజ్‌భవన్‌లో అధికారికంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నెల 24 వరకు శ్రీ వికారి నామ సంవత్సరం పూర్తయి 25న శ్రీ శార్వరి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వేడుకలు రవీంద్రభారతిలో నిర్వహించేవారు. ముఖ్యమం త్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వీఐపీలు హాజరయ్యేవా రు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ప్రగతి భవన్‌లో నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకల సందర్భంగా పంచాంగ శ్రవణం జరిగేది. కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలను నిర్వహంచేది లేనిది ఇంకా నిర్ణయం తీసుకోలేదు.