తెలంగాణ

సర్వీసు కమిషన్‌లో కరోనా రక్షిత చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పబ్లిక్ సర్వీసు కమిషన్‌లో రక్షిత చర్యలను చేపట్టినట్టు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి చెప్పారు. గురువారం నాడు కమిషన్ కార్యాలయంలో సీనియర్ అధికారులతో సమీక్ష చేసిన అనంతరం పలు చర్యలు చేపట్టినట్టు ఆయన చెప్పారు. కార్యాలయంలో పారిశుద్ధ్య పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ సర్ట్ఫికేట్ల పరిశీలన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. అలాగే కమిషన్‌కు వచ్చే విజిటర్లపై నియంత్రణ విధించినట్టు పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యలపై ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసినట్టు చెప్పారు.
ఫుడ్ సేఫ్టీ అధికారుల పరీక్ష కీ విడుదల
ఫుడ్ సేఫ్టీ అధికారుల నియామకానికి నిర్వహించిన ఎంపిక పరీక్ష కీ విడుదల చేసినట్టు కమిషన్ కార్యదర్శి ఏ వాణీ ప్రసాద్ తెలిపారు. దీంతో పాటు నోటిఫికేషన్ నెంబర్ 08/2019 ఎంపిక పరీక్ష కీ కూడా విడుదల చేసినట్టు ఆమె చెప్పారు.
ఇఫ్లూలో ఆన్‌లైన్ టీచింగ్
కోవిడ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ముఖాముఖి తరగతులకు స్వస్తి పలికి 19వ తేదీ నుండి ఆన్‌లైన్ టీచింగ్ ప్రారంభించినట్టు వీసీ ప్రొఫెసర్ ఇ సురేష్‌కుమార్ చెప్పారు. పీహెచ్‌డీ ముఖాముఖి పరీక్షలను సైతం ఆన్‌లైన్‌లో నిర్వహించి సరికొత్త పుంతలు తొక్కిందని అన్నారు.