తెలంగాణ

రాజకీయ ప్రకటనలతో ఏపీని బలిపశువు చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: రాజకీయ ప్రకటనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలిపశువును చేశారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధనరెడ్డి పేర్కొన్నారు. గురువారం నాడు హైదరాబాద్‌లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అధికార పార్టీ వ్యవస్థలను బెదిరిస్తోందని, దీనిని బీజేపీ గర్హిస్తోందని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని విపక్షాలపై అధికార పార్టీ నేతల దాడులు అందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ రాసినట్టుగా పేర్కొంటున్న లేఖ గురించి ఆయనేమీ మాట్లాడటం లేదని, అసలు లేఖ నకిలీదో, నకలో తెలియడం లేదని, నకిలీది అయితే సూమోటోగా కేసు నమోదు చేయవచ్చని అన్నారు. ఈ లేఖకు సంబంధించి ఉన్న అనుమనాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసు కమిషనర్‌పై ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు. అధికార విపక్ష నేతలు మాటలు చూస్తుంటే ప్రజలు తలదించుకోవల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. బాధ్యత మరచి పార్టీలు వ్యవహరిస్తున్నాయని, టీడీపీ- వైకాపాలు రెండూ ఏపీకి పట్టిన శని అని వ్యాఖ్యానించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, వీరి భాషను చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. ఎన్నికల కమిషనర్‌కే రక్షణ లేకపోతే ఏపీ పోలీసులు ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఎన్నికల కమిషనర్‌గా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించకపోతే ఆ ఎన్నికలను రద్దు చేసే అధికారం ఉంటుందని, ఇంత వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని అన్నారు. కమిషనర్ నోరు విప్పకపోతే వైకాపా రోపణలకు ఆయన ఊతం ఇచ్చినట్టేనని చెప్పారు.